Bathukamma In Dubai : రేపు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన..!

Bathukamma In Dubai : హైదరాబాద్: తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశ్వవేదికపై తన గొప్పతనాన్ని చాటేందుకు సిద్దమైంది.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం 23 వ తేదీ న ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై, బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ ను ప్రదర్శించబోయే తెర( స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది కావడం మరో విశేషం. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై బతుకమ్మ ను వీక్షించనున్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మన సాంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రేపు సాయంత్రం దుబాయ్ లో జరగబోయే ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
రేపు సాయంత్రం భారత కాలమానం ప్రకారం 9.40 PM కు , 10.40 PM కు రెండు సార్లు బుర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ వీడియో ప్రదర్శించబడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com