అందమైన ద్వీపం అమ్మకానికి.. ధర తెలిస్తే షాకే..

అందమైన ద్వీపం అమ్మకానికి.. ధర తెలిస్తే షాకే..
చుట్టూ నీరు మధ్యలో ఓ చిన్న భూభాగం.. పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి ద్వీపాలు. మరి అలాంటి ఓ చిన్న ద్వీపం అమ్మకానికి ఉందంటే ఆసక్తి, డబ్బులు ఉన్నవారు ఎగిరి గంతేయరూ.. మరింకెందుకు ఆలస్యం

చుట్టూ నీరు మధ్యలో ఓ చిన్న భూభాగం.. పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి ద్వీపాలు. మరి అలాంటి ఓ చిన్న ద్వీపం అమ్మకానికి ఉందంటే ఆసక్తి, డబ్బులు ఉన్నవారు ఎగిరి గంతేయరూ.. మరింకెందుకు ఆలస్యం శాన్ ఫ్రాన్సిస్కో బే మధ్యలో ఉన్నరెడ్ రాక్ ఐలాండ్ అమ్మకానికి ఉంది. కొనగలరేమో ఆలోచించండి.

ప్రస్తుతం ఒక చెట్టు, బీచ్ , ఖాళీగా ఉన్న కోస్ట్ గార్డ్ కాంపౌండ్ ఇందులో ఉన్నాయి. ఇక్కడ రహస్యంగా మాంగనీస్ తవ్వకాలు కూడా జరిగాయి. దీవిలో నిధి ఉండే అవకాశం కూడా ఉంది.

5.8 ఎకరాలు ఉన్న రెడ్ రాక్ ఐలాండ్ కొనాలనుకుంటే 25 మిలియన్ డాలర్లు మీ దగ్గర ఉండాలి. అంతకుముందు కూడా ఒకసారి అమ్మకానికి వచ్చింది ఈ ద్వీపం. 2015లో ఈ దీవిని విక్రయించే ప్రయత్నం జరిగింది. అప్పట్లో దీని ధర కేవలం 5 మిలియన్ డాలర్లు. మళ్లీ 2011లో ఒకసారి సేల్ పెట్టారు అప్పుడు దీని ధర 22 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. ఇప్పుడు మరింత పెరిగి 25 మిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఈ ద్వీపాన్ని కొనాలంటే సుమారు రూ. 200 కోట్లకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి.

రెడ్ రాక్ ఐలాండ్ యజమాని బ్రాక్ డర్నింగ్ ప్రస్తుతం అలాస్కాలో నివసిస్తున్నారు. అతను తన తండ్రి నుండి ఈ ద్వీపాన్ని వారసత్వంగా పొందాడు. 22 ఏళ్లుగా ఇక్కడికి రావడానికి అతడికి వీలు పడడం లేదు. బ్రాక్ తల్లి కూడా చాలా పెద్దవారు అయిపోయారు. ఆమెని చూసుకోవడానికి కూడా డబ్బులు కావలసి వస్తోంది. అందుకే అందమైన ఈ ద్వీపాన్ని అమ్మకానికి పెట్టారు బ్రాక్.

శాన్ ఫ్రాన్సిస్కోలో ఐదు ద్వీపాలు ఉన్నాయి. వీటిని రెడ్ రాక్, సీల్ రాక్స్, ట్రెజర్ ఐలాండ్, యెర్బా బ్యూనా, ఆల్కాట్రాజ్ అని పిలుస్తారు. రెడ్ రాక్ అనేది ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న ఏకైక ద్వీపం. రెడ్ రాక్ కాంట్రా కోస్టా, మారిన్, శాన్ ఫ్రాన్సిస్కో మూడు కౌంటీల పరిధిలోకి వస్తుంది. అందువల్ల ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా ముందుగా మూడు జిల్లాల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

4.1 ఎకరాల ద్వీపం రిచ్‌మండ్ నగరంలో ఉంది. గతంలో కూడా ఇక్కడ ఇళ్లు, యాచ్‌ హార్బర్‌, బొటానికల్‌ గార్డెన్‌, బిల్‌ బోర్డులు, క్యాసినో, రెస్టారెంట్‌, హోటల్‌, 25 అంతస్తుల భవనం నిర్మించాలన్న ప్రతిపాదనలు తిరస్కరించబడ్డాయి.

రెడ్ రాక్ ద్వీపంలో ఓటర్లను పట్టుకోవడానికి రష్యన్లు తరచుగా సందర్శిస్తుంటారు. 1964లో మెండెల్ గ్లిక్‌మన్ అనే వ్యక్తి కేవలం 50 వేల డాలర్లకు ఈ ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. ఇక్కడ ఇల్లు కట్టడమే కాకుండా గ్యాస్ కూడా కనిపెట్టాలనుకున్నాడు. మెండెల్ దానిని బ్రాక్ తండ్రికి అమ్మాడు. ప్రస్తుతం ఒక చెట్టు, ఒక బీచ్ మరియు ఖాళీగా ఉన్న కోస్ట్ గార్డ్ కాంపౌండ్ ఉంది. ఇక్కడ కరెంటు, నీటి వ్యవస్థ లేదు. 1900 ప్రాంతంలో, మాంగనీస్ మైనింగ్ కూడా ఇక్కడ రహస్యంగా జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story