ఆమె లాటరీ టిక్కెట్ ముష్టిగా వేసింది.. బిచ్చగాళ్ల అదృష్టం పండి రూ.43 లక్షలు..

లాటరీ టికెట్ కొంటే లక్కు మారేదో లేదో తెలియదు కానీ ఆమె ద్వారా ఆ నలుగురు బిచ్చగాళ్లు లక్షాధికారులు అయ్యారు. ఫ్రాన్స్‌లోని బ్రెస్ట్ నగరంలో బిచ్చగాళ్లకు ఓ యువతి వేసిన లాటరీ టికెట్లు వారికి 43 లక్షల రూపాయలను తెచ్చిపెట్టింది. లాటరీ షాపు దగ్గర బిచ్చమెత్తుకుంటున్న బిచ్చగాళ్లు వచ్చే పోయే వాళ్ల మాకు దానం చేస్తే మీకు కచ్చితంగా లాటరీ టికెట్ తగులుతుంది అని అంటూ అడుక్కుంటున్నారు.
రోజు మాదిరే ఆ రోజు కూడా అదే విధంగా అడగడంతో ఓ యువతి తాను కొన్న లాటరీ టికెట్లలో కొన్ని తీసి వారి గిన్నెలో వేసింది. ఇవి మాకెందుకమ్మా.. మాకంత అదృష్టం లేదు.. డబ్బులుంటే వెయ్యరాదు తల్లీ అన్నారు.. అయినా తన దగ్గర చిల్లర లేదని వెళ్లి పోయింది ఆ యువతి.. నిజంగానే అదృష్ట దేవత ఆ నలుగురు బిచ్చగాళ్లను వరించింది. యువతి వేసిన లాటరీ టికెట్లను స్క్రాచ్ చేయగా రూ.43 లక్షలు గెలుచుకున్నట్లు తెలిసింది. వాళ్ల సంతోషానికి అవధులు లేవు.
దీంతో లాటరీ టికెట్ ఇచ్చిన యువతిని దేవతగా భావిస్తున్నారు. బిచ్చగాళ్లు లాటరీ టికెట్ గెలుచుకున్న విషయం నిజమేనని ఫ్రెంచ్ లాటరీ ఆపరేటర్ ఎఫ్‌డీజే ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తమ వద్ద లాటరీ టికెట్ కొన్న యువతి బిచ్చగాళ్లకు దానమివ్వడంతో ఆ డబ్బు వారికే సొంతమని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com