11 Nov 2020 6:23 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / వామ్మో.. పావురానికి...

వామ్మో.. పావురానికి రూ.11 కోట్లా.. ఎందుకో అంత డిమాండ్

ఈ పావురాన్ని చేజిక్కించుకోవడానికి వేలంలో పోటీపడుతున్నారు..

వామ్మో.. పావురానికి రూ.11 కోట్లా.. ఎందుకో అంత డిమాండ్
X

ఓహో ఓహో పావురమా.. వయ్యారి పావురమా.. నీకంత డిమాండు ఎందుకో మాకైనా తెలుపుమా.. మనుషుల్లా కాదు.. మా పావురాల్లో ఉత్తమ జాతులున్నాయి.. అవి పందెంలో పాల్గొంటాయి.. మీకు కోట్లు కుమ్మరించి పెడతాయి మరి.. అవునా.. ఆ కధేంటో చూద్దాం.. మనకి తెలిసినవి కోళ్ల పందేలు, గుర్రెం పందేలు.. అదే బెల్జియంకి వెళితే అక్కడ పావురాలతో పందేలు నిర్వహిస్తూ బిజీగా ఉంటారు.

ఇందుకోసం అక్కడ ఓ వెబ్‌సైట్‌ కూడా నడుస్తోంది. బెల్జియంకు చెందిన హొక్ వాన్ డె వూవెర్ అనే వ్యక్తి పందేల్లో వాడే పావురాలను సేకరించడం, కొత్త జాతి పావురాలను సృష్టించడం అతడి పని. అలా సృష్టించిన కొత్త జాతి పావురాలతో పాటు, రేసుల్లో అనేక పథకాలు గెలిచిన కొన్ని పావురాలను ఇటీవల తన సంస్థ వెబ్‌సైట్ 'pipa' ద్వారా ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించాడు.

వీటిలో 'న్యూకిమ్' అనే పేరు గల పావురం చాలా స్పెషల్.. రెండేళ్ల వయసున్న ఈ పావురాన్ని చేజిక్కించుకోవడానికి వేలంలో పోటీపడుతున్నారు.. వేలం వేసిన మొదటి రోజు 237 డాలర్లు (దాదాపు రూ.17.5 వేలు) ఉండగా.. ప్రస్తుతం 1.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.11.48 కోట్లు) పలుకుతోంది.

మరో నాలుగు రోజుల్లో ముగియనున్న వేలంపాటలో మరెంత ధరకు చేరుకుంటుందో ఈ పావురం అని వేలం నిర్వాహకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పావురంగా రికార్డులకు ఎక్కనున్న ఈ పావురాన్ని ఎవరైనా ఎత్తుకు పోతారేమోనని దానికి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసింది కంపెనీ.

Next Story