America : రష్యాకి షాకిచ్చిన జో బైడెన్.. గ్యాస్, చమురు దిగుమతులపై నిషేధం
America : ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందులో భాగంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించింది. గ్యాస్, చమురు దిగుమతులు బ్యాన్ చేసింది. పుతిన్ వార్ మెషిన్‌లా మారాడని బైడెన్ మండిపడ్డారు. రష్యా నుంచి అన్ని దిగుమతుల్ని నిషేధిస్తున్నామని పేర్కొన్నారు.
పోలెండ్, ఉక్రెయిన్‌లో పరిస్థితులపై సమీక్షిస్తున్నామని.. ఉక్రెయిన్ అండగా ఉంటామని.. నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. యూరోపియన్ దేశాలు తమతో కలిసి వచ్చేలా లేవన్నారు.
మిత్ర దేశాల పరిస్థితులను తాము అర్థం చేసుకోగలమని.. తమ చర్యల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఉక్రెయిన్ శరణార్థులకు అండగా ఉంటామని చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com