Biden: జీ 20 కి జిన్ పింగ్ రాకపోవటం నిరాశ పరిచింది..
భారతదేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాబోరంటూ ప్రచారం జరుగుతోంది. భారత్, చైనా మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని జిన్ పింగ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్న పలువురు అధికారులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. జిన్ పింగ్ హాజరుపై సందేహాలు నెలకొన్నాయని, ఇప్పటి వరకు తమకు ఎలాంటి సూచనలు అందలేదని చెప్పారు.ఈ వార్తలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు.
ఈ నెల 9, 10 తేదీల్లో భారత్ అధ్యక్షతన ఢిల్లీలో ప్రతిష్టాత్మక జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఈ సదస్సుకు తాను రాలేకపోతున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే పేర్కొన్నారు. ఆయన తరపున రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరుకానున్నారు. అయితే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైతం గర్హాజరయ్యే అవకాశాలున్నాయి. విషయం అధికారికంగా బయట పడనప్పటికీ తాజాగా చైనాతో సరిహద్దు వివాదం తెరపైకి రావడంతో జిన్‌పింగ్ జిన్‌పింగ్ రాకపై సందిగ్ధం నెలకొంది. ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ రావొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఈ విషయం పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో ఓ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. భారత్‌లో జరిగే జీ20 నేతల శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్ రావడం లేదనే వార్తలు విని కలత చెందినట్లు తెలిపారు. ‘చైనా అధ్యక్షుడు సదస్సుకు రాకపోవడం తనకు నిరాశకు గురి చేసిందన్నారు. అయినా ఆయన్ను నేను త్వరలోనే చూడబోతున్నానని పేర్కొన్నారు.
కానీ వారిద్దరూ ఎక్కడ కలవబోతున్నారనేది మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ జిన్‌పింగ్ ఢిల్లీ రాకపోతే.. నవంబర్‌లో అమెరికా అతిథ్యం ఇస్తున్న శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే APEC సమావేశంలో వీరిరువురూ కలుసుకునే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సదస్సుకు రెండు రోజుల ముందే అంటే సెప్టెంబర్ 7నే భారత్‌కు రానున్నారు. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపి,9, 10 తేదీల్లో జీ20 సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్బంగా సభ్య దేశాల ప్రతినిధులతో వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీ వంటి అంశాలతోపాటు ఉక్రెయిన్ సంక్షోభం వంటి అంతర్జాతీయ సమస్యలపై చర్చిస్తారు. అనంతరం బైడెన్.. వియత్నాం పర్యటకు వెళ్తార తన భారత్‌లో పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు బైడెన్ తెలిపారు. భారత్, వియత్నాం రెండూ యూఎస్‌తో చాలా సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నారని, అది చాలా తమకు కూడా సహాయకారిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com