Biden : త్వరలోనే హవాయిని సందర్శిస్తా

Biden : త్వరలోనే హవాయిని సందర్శిస్తా
100మంది మృతులు, 3 వేల జంతువులు.. 2200 భవనాలు.. నాశనం


ఎట్టకేలకు అమెరికా ప్రధాని జో బైడెన్ హవాయి కార్చిచ్చు పై స్పందించారు. హవాయి గురించి స్పందించమని బైడెన్ను మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు అతను నిరాకరించడం తీర విమర్శలకు కారణమైంది. దీంతో మంగళవారం ప్రసంగాన్ని ఆయన హవాయి కార్చిచ్చు అంశం తోనే మొదలు పెట్టాల్సి వచ్చింది. ఈ కార్చిచ్చు ఆపడానికి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ నుంచి అక్కడివారికి మొదటి సహాయం అందిందన్న బైడెన్, కోస్ట్ గార్డ్ నేవీ మరియు ఆర్మీ హెలికాప్టర్లు కూడా రిస్క్యు ఆపరేషన్ లో పాలుపంచుకున్నాయన్నారు. త్వరలోనే తన భార్యతో కలిసి హవాయి ద్వీపాన్ని సందర్శిస్తామన్నారు.


మంటల కారణంగా ఇక్కడ మృతి చెందిన వారి సంఖ‌్య ౧౦౦ కి చేరింది. అలాగే శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం గాలిస్తున్నారు. కానీ లోహాలు సైతం కరిగిపోయిన ఈ ఘటనలో మృత దేహాల వెతికితీత ప్రక్రియ ఇప్పటివరకు 25% మాత్రమే పూర్తయ్యింది. శరీరపు భాగాలు ముద్దుల ముద్దలుగా ఉంటుండడంతో అధికారులు సైతం శరీర భాగాలను గుర్తించేందుకు DNA పరీక్షలపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.



ఇప్పటి వరకు లభించిన 99 మృతదేహాలలో నాలుగింటిని మాత్రమే వేలిముద్రల ఆధారంగా గుర్తించగలిగారు. మానవ, జంతు అవశేషాలకోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. అక్కడి పరిస్థితి చూస్తుంటే రానున్న పది రోజుల్లో మృతుల సంఖ్య రెట్టింపు పై అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.కార్చిచ్చు ధాటికి మొత్తం 2,200 నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి.అందులో 86 శాతం మేర నివాసాలే అని అధికారులు చెబుతున్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు అధికారులు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 46 వేల మంది నిర్వాసితులు, సందర్శకులు స్థానిక విమానం విమానాశ్రయాలు ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లారని హవాయి టూరిజం అథారిటీ తెలిపింది. గత 100 ఏళ్లలో ఈ స్థాయి కార్చిచ్చు చూడలేదని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.



నిజానికి కార్చిచ్చు ప్రారంభానికి ముందు ఈ ప్రాంతాన్ని ఒక హరికేన్ చుట్టుముట్టింది. ఆ హరికేన్ ప్రభావాన్ని విమానాల ద్వారా అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బందే మొదటగా కార్చిచ్చుని చూశారు. అప్రమత్తం అయ్యి, అధికారులకు తెలిపేలోపే గాలుల కారణంగా మంటలు వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో నిత్యం పచ్చగా కనిపించే ప్రాంతాలన్నీ ఇప్పుడు బూడిదగా మారిపోయాయి. ఇక మంటల హడావిడిలో తమ వారి నుంచి తప్పిపోయిన మనుషులను అలాగే జంతువులను సొంతగూటికి చేర్చడానికి కూడా కొన్ని సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ కార్చిచ్చులో ఇళ్లు కోల్పోయిన బాధితులకు అధికారులు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చనిపోయిన మూగజీవాల సంఖ్య 3 వేలకు పైగా ఉండవచ్చని అధికారుల అంచనా. గల్లంతైన పెంపుడు జంతువులను వాటి యజమానుల దగ్గరకు చేర్చేందుకు మౌయి హ్యూమన్‌ సొసైటీ తీవ్రంగా కృషి చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story