విజయానికి కేవలం 6 ఓట్ల దూరంలో జోబైడెన్

క్షణక్షణం తీవ్ర ఉత్కంఠను రేపుతున్న వైట్‌హౌజ్ రేస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుటున్నాయి. వైట్ హాజ్ రేసులో ఓ అడుగు ముందుకేసిన జోబైడెన్ విజయానికి కేవలం 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో నిలిచారు...జోబైడెన్, ట్రంప్ మధ్య ఆధిపత్యం దోబూచులాడుతూ వస్తోంది. మొదట బైడెన్, ఆ తర్వాత ట్రంప్.. మళ్లీ ఇప్పుడు బైడెన్ ఇలా నిమిషనిమిషానికి ఆధిపత్యం చేతులు మారుతూ వస్తోంది. ప్రస్తుతం డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ ముందంజలో ఉన్నారు. 264 ఎలక్టోరల్ సీట్లు గెలుచుకొని...శ్వేతసౌధానికి కేవలం 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో నిలిచారు. అటు ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు.. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఇప్పటికే 45 రాష్ట్రాలు ఫలితాలు వెల్లడయ్యాయి. అయినా అధికారికంగా విజేత ఎవరో తేల్చలేని పరిస్థితి నెలకొంది. ఇంకా నెవాడ, పెన్సిల్వేనియా, నార్త్‌కరోలినా, జార్జియా, అలస్కా రాష్ట్రాల రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఇందులో నెవాడలో బైడెన్ అధిక్యంలో ఉన్నారు.. మిగతా నాలుగు రాష్ట్రాల్లో ట్రంప్ సల్వంగా లీడ్‌లో కొనసాగుతున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ పోస్టల్ బ్యాలెట్లు అత్యధికంగా ఉన్నాయి. అందుకే కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం లీడ్‌లో ఉన్న పెన్సిల్వేనియా, నార్త్‌కరోలినా, జార్జియా, అలస్కాలో ట్రంప్ గెలిచినా మొత్తం ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 268కే చేరనుంది. అటు 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నెవాడలో బైడెన్ గెలిస్తే మ్యాజిక్ ఫిగర్ 270ని చేరుకుంటాడు.
అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.. మ్యాజిక్ ఫిగర్‌కు 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌నకు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇక మిషిగన్, విస్కాన్సిన్, ఆరిజోనా , కాలిఫోర్నియా , కొలరాడో , కనెక్టికట్ , డెలావర్ , డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా , హవాయి , ఇల్లినాయిస్ , మెయిన్ , మేరీల్యాండ్ , మసాచుసెట్స్, మిన్నెసొటా , నెబ్రాస్కా , న్యూహ్యాంపిషైర్ , న్యూ జెర్సీ , న్యూ మెక్సికో , న్యూయార్క్ , ఓరిగాన్ , రోడ్ ఐలండ్ , వెర్మోంట్ , వర్జీనియా , వాషింగ్టన్ రాష్ట్రాల్లో జోబైడెన్ విజయం సాధించారు..
అలబామా , అర్కన్‌సస్, ఫ్లోరిడా , ఇదహో , ఇండియానా , అయోవా , కాన్సాస్ , కెంటకీ , లూసియానా , మిసిసిపి , మిస్సోరి , మాంటానా , నెబ్రాస్క, నార్త్ డకోటా , ఒహైయో, ఒక్లహామా , సౌత్ కరోలినా , సౌత్ డకోటా , టెన్నీసె, టెక్సాస్ , ఉతా , వెస్ట్ వర్జీనియా , వ్యోమింగ్ రాష్ట్రాలు ట్రంప్ ఖాతాలోకి వెళ్లాయి..
ప్రస్తుతం ఉన్న ఫలితాల ప్రకారం చూస్తే ఎవరు గెలిచినా అత్యంత స్వల్ప మెజార్టీతో మాత్రమే గట్టెక్కే అవకాశం ఉంది. అప్పుడు ఫెయిత్‌లెస్ ఎలక్టోరల్ ఓట్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు 306 ఎలక్టోరల్ ఓట్లు వస్తే వారిలో ఇద్దరు ట్రంప్‌కు ఓటు వేసేందుకు నిరాకరించారు. అలానే 227 ఓట్లు హిల్లరీకి రాగా.. వారిలో ఐదుగురు ఆమెకు ఓటు వేసేందుకు నిరాకరించారు. ఒక వేళ బైడెన్, ట్రంప్ మధ్య ఆధిక్యం ఐదు నుంచి 10 ఎలక్టోరల్ ఓట్ల లోపే ఉంటే ఫెయిత్ లెస్ ఎలక్టోరల్స్ అమెరికా అధ్యక్షుడిని డిసైడ్ చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com