ZELENSKY: జెలెన్‌స్కీకి భారీగా పెరిగిన మద్దతు

ట్రంప్, జెలెన్‌స్కీ భేటీ తర్వాత ఉక్రెయిన్‌కి యూరోపియన్ యూనియన్‌కు చెందిన నేతలు మద్దతు తెలిపారు. ‘అన్యాయంగా, చట్ట విరుద్దంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు యుద్దం చేస్తున్న ఉక్రెయిన్‌కు కెనడా అండగా ఉంటుంది’. అని కెనడా ప్రధాని ఎక్స్ వేదికగా ప్రకటించారు. జెలెన్‌స్కీకి పోలిష్ ప్రధాని, ఇటలీ ప్రధాని సైతం మద్దతు తెలిపారు.
క్షమాపణలు చెప్పను: జెలెన్ స్కీ
వైట్‌హౌస్‌లో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌తో వాగ్వాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో.. వైట్ హౌస్‌లో జరిగిన ఘటనపై క్షమాపణ చెప్పే ఉద్దేశం ఉందా అని అడగ్గా.. అలాంటిదేమీ లేదని, తాను యూఎస్ అధ్యక్షుడిని, ప్రజలను గౌరవించానని సమాధానమిచ్చారు. అలాగే, ‘థాంక్యూ US. మీ మద్దతుకు కృతజ్ఞతలు. థాంక్యూ ప్రెసిడెంట్. ఉక్రెయిన్‌కు శాశ్వత శాంతి కావాలి’ అని ట్వీట్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య మీడియా సమావేశంలోనే వాగ్వాదం జరిగింది. ట్రంప్, జెలెన్ స్కీ మాటల యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఓవల్ ఆఫీసుకు వెళ్లేందుకు ట్రంప్ ఆహ్వానించగా.. జెలెన్స్ స్కీ తిరస్కరించడంతో ఈ గొడవ ఆరంభమైంది. లక్షలాది మంది జీవితాలతో జెలెన్ స్కీ ఆటలాడుతున్నారని ట్రంప్ మండిపడగా.. ఈ వ్యాఖ్యలను జెలెన్ స్కీ ఖండించారు.
జెలెన్‌స్కీకి ఇలా జరగాల్సిందే: రష్యా
ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంపై రష్యా స్పందించింది. ‘అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న ఉక్రెయిన్‌కు ఈ పరిణామం గట్టి చెంపదెబ్బ. జెలెన్‌స్కీకి ఇలా జరగాల్సిందే’ అని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ అన్నారు. రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘ఉక్రెయిన్ చీఫ్ తమకు అన్నం పెట్టిన చేతినే గాయపరుస్తున్నారు. ఆయనపై దాడి చేయకుండా ట్రంప్ సంయమనం పాటించడం అద్భుతమే’ అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com