Bill Gates: పడ్డానండి ప్రేమలో మళ్లీ....

మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్ మరోసారి ప్రేమలో పడ్డారంట. 27ఏళ్ల జీవిత సహచరి మెలిండా గేట్స్ కు విడాకులు ఇచ్చిన తరువాత ఒంటరిగా మిగిలిన ప్రపంచ కుబేరుడు మరో సహచరి చెంత చేరారు. పౌలా హార్డ్ అనే మహిళతో బిల్ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారని అంతర్జాతీయ ప్రెస్ కోడై కూస్తోంది. పౌలా హార్డ్ మరెవరో కాదు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఒరాకల్ సీఈఓ మార్క్ హర్డ్ భార్య. మార్క్ 2019లో చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పౌలా కూడా ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇక బిల్, పౌలా డేటింగ్ రూమర్లు అంతటా వ్యాపించగా, ఇరువురూ తమ బంధాన్ని దాచే ప్రయత్నం కూడా చేయడంలేదని వినికిడి. ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ ఓపెన్ లో మెన్స్ సింగిల్స్ ఫైనల్ కు బిల్, పౌలా కలసి హాజరయ్యారు. దీంతో వీరి బంధం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇరువురూ ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయడంలేదు కాబట్టి, త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com