11 May 2022 6:02 AM GMT

Bill Gates: బిల్‌గేట్స్‌కు కరోనా పాజిటివ్..

Bill Gates: ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Bill Gates: బిల్‌గేట్స్‌కు కరోనా పాజిటివ్..
X

Bill Gates: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తనకు లక్షణాలు తేలికగా ఉన్నాయని తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.

అలాగే మరొక ట్వీట్‌లో "నేను కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ డోసులు అన్నీ వేయించుకున్నాను. బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నాను.. అత్యవసర వైద్య చికిత్సను పొందే అవకాశం ఉండడం అదృష్టం అని ట్వీట్ చేశారు.

మహమ్మారి నివారణకుగాను ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రత్యేకంగా పేద దేశాలకు వ్యాక్సిన్‌లు మరియు మందుల సప్లై గురించి. అక్టోబరులో గేట్స్ ఫౌండేషన్ ద్వారా అందించారు. అలాగే తక్కువ-ఆదాయం ఉన్న దేశాల కోసం డ్రగ్‌మేకర్ మెర్క్ యొక్క యాంటీవైరల్ కోవిడ్-19 పిల్ యొక్క జెనరిక్ వెర్షన్‌లకు యాక్సెస్‌ను పెంచడానికి $120 మిలియన్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.

Next Story