BLA: సురబ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ ఆర్మీ!

BLA: సురబ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ ఆర్మీ!
X
పాకిస్థాన్‌కు మరో షాక్‌..

పాకిస్థాన్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అనుకూలమైన అవకాశాల్ని వదులుకోకుండా వరుసగా దాడులు జరుపుతూ, పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పాక్ లోని అనేక ప్రాంతాల్లో ప్రభావాన్ని పెంచుకున్న బీఎల్ఏ.. తాజాగా మరో కీలక విజయాన్ని సాధించింది. తాజాగా పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సురబ్ జిల్లాను BLA సాయుధ యోధులు స్వాధీనం చేసుకున్నారు. సురబ్ పట్టణంలోని లెవీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, ఒక బ్యాంకు సహా అనేక కీలక ప్రాంతాలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆక్రమించింది. పెద్ద సంఖ్యలో సాయుధ సభ్యులు నగరానికి ప్రవేశించి, క్వెట్టా-కరాచీ, సురబ్-ఘిదర్ హైవేలు పైన సోదాలు నిర్వహిస్తున్నారు.

ఆ ప్రాంతంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం లేదా భద్రతా సంస్థల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. BLA ప్రతినిధి జియాంద్ బలోచ్ ఒక ప్రకటనలో తమ యోధులు సురబ్ పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. స్థానిక బ్యాంకులు, లెవీలు, పోలీస్ స్టేషన్లు ఇప్పుడు తమ నియంత్రణలో ఉన్నాయని ఆయన తెలిపారు. అదనపు డిప్యూటీ కమిషనర్ (ADC) హిదాయత్ ఉల్లా ఊపిరాడక మరణించారు. సాయుధ దుండగులు అతన్ని ఒక గదిలో బంధించారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.

Tags

Next Story