USA: అమెరికాలో పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి

USA: అమెరికాలో పోలీసుల చేతిలో మరో నల్లజాతీయుడు బలి
మెడపై కాలిపెట్టి నొక్కి చంపిన

అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ తరహా ఉదంతం మరొకటి చోటుచేసుకుంది. ఒహియోలో రాష్ట్రంలో ఫ్రాంక్ టైసన్ అనే నల్లజాతీయుడు అక్కడి పోలీసుల కర్కశత్వానికి బలైపోయాడు. ఓ కేసులో టైసన్ ను అరెస్టు చేసే క్రమంలో అతని మెడపై ఓ పోలీసుకాలి నొక్కి పెట్టడంతో ఊపిరాడక చనిపోయాడు. ఇందుకు సంబంధించి పోలీసు బాడీ-కెమెరా ఫుటేజీని అక్కడి అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 18న కారులో వెళుతున్న టైసన్ తూర్పు కాంటన్ లో ఓ యుటిలిటీ పోల్ ను ఢీ కొట్టిన అనంతరం బార్ కు వెళ్లాడు. టైసన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు టైసన్ మెడపై కాలితో నొక్కి పెట్టి అతని చేతులను వెనక్కి లాగి సంకెళ్లు వేశారు. తాను ఊపిరి పీల్చుకోలేకపోతున్నానని టైసన్ పదే పదే చెప్పినా ఆ పోలీసు వినిపించుకోలేదు. ఈ క్రమంలో టైసన్ అచేతనంగా ఉండిపోయాడు.తర్వాత పోలీసులు CPR చేసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ టైసన్ ఆస్పత్రిలో మరణించాడు.గతంలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు ఇలాగే ప్రాణాలు కోల్పోగా అమెరికా పోలీసుల తీరుపై ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేగింది.

ఇక ఇప్పటికే ఓ కిడ్నాప్​, దొంగతనం కేసులో ఫ్రాంక్ టైసన్ 24 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. ఏప్రిల్ 6న జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే టైసన్​ తన పేరోల్​కు సంబంధించి ఉన్నతాధికారికి రిపోర్టు చేయలేదని పోలీసులు తెలిపారు. ఫ్రాంక్ టైసన్​ మరణంపై కాంటన్ మేయర్ విలయం షెరర్​2 స్పందిస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు. 'ఫ్రాంక్​ టైసన్​ కుటుంబానికి వ్యక్తిగతంగా తన సానుభూతిని తెలియజేస్తున్నా. టైసన్​ మరణానికి సంబంధించిన బాడీక్యామ్ ఫుటేజీని విడుదల చేశాం. ప్రస్తుతం సవాలుతో కూడిన సమయంలో వీలైనంత పారదర్శకంగా ఉండటమే నా లక్ష్యం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు' అని మేయర్ విలయం షెరర్​ తెలిపారు. గతంలో జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడు ఇలాగే ప్రాణాలు కోల్పోగా అమెరికా పోలీసుల తీరుపై ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేగింది. జార్జ్​ మరణానికి కారణమైన పోలీసు అధికారిని కోర్టు కఠిన శిక్ష విధించింది.

Tags

Read MoreRead Less
Next Story