15 Oct 2021 10:48 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / Kandahar Blast :...

Kandahar Blast : కాందహార్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి.. 13మందికి గాయాలు..!

Kandahar Blast : ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ మసీదు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Kandahar Blast : కాందహార్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి.. 13మందికి గాయాలు..!
X

ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ మసీదు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సెంట్రల్ హాస్పిటల్‌ కి తరలించారు. శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఈ సంఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. అయితే ఈ దాడికి ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు. అంతకుముందు అక్టోబర్ 8 న, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో మసీదు పేలుడులో దాదాపుగా 100 మంది మరణించారు మరికొందరు గాయపడ్డారు. ఈ వరుస పేలుళ్లు షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్నాయని, ఆత్మాహుతి బాంబర్ ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. తాలిబన్లు షియాలకు రక్షణ ఇవ్వాలని ఆ మత పెద్దలు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story