Afghanistan Blast : అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి... వంద మందికి పైగా దుర్మరణం..!

Afghanistan Blast : అఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి... వంద మందికి పైగా దుర్మరణం..!
X
Afghanistan Blast : అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి నెత్తురు ఏరులై పారింది. ఉగ్రమూకలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటన కుందజ్‌లోని సయ్యద్‌ ఆబాద్‌ మసీదులో జరిగింది.

Afghanistan Blast : అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి నెత్తురు ఏరులై పారింది. ఉగ్రమూకలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటన కుందజ్‌లోని సయ్యద్‌ ఆబాద్‌ మసీదులో జరిగింది. ఆత్మాహుతి దాడిలో వంద మందికి పైగా దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మృతదేహాలు ఎగిరిపడ్డాయి. ఒక్కక్షణం ఏం జరిగిందో తెలియక జనం పరుగులు తీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మసీదులో రోజూ ప్రార్థనలు చేసేందుకు వందల మంది వెళ్తుంటారు. ప్రశాంతంగా ప్రార్ధనలు చేసే సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీనిపై తాలిబన్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడిలో గాయపడిన అనేక మంది విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

Tags

Next Story