Lunar Eclipse: హోళీ పర్వదినాన చంద్రగ్రహణం, భారత్ లో లేదు కానీ ..

జ్యోతిషశాస్త్రంలో తొమ్మిది గ్రహాలలో సూర్యుని తర్వాత చంద్రుడు అత్యంత ముఖ్యమైన గ్రహం. జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు లేకుండా పండితులు ఎటువంటి లెక్కలు చేయలేరు. అందుకే జ్యోతిషశాస్త్రంలో చంద్రుడికి ప్రముఖ స్థానం ఉంది. ఇది భూమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి నేరుగా ప్రభావితం చేస్తుంది. చంద్రునిపై జరిగే ప్రతి సంఘటన భూమిపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. వాటిల్లో గ్రహణాలు కూడా ప్రభావం చూపుతాయంటున్నారు. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది. దీన్నే బ్లడ్ మూన్ గా పిలుస్తారు. హోళీ పర్వదినాన చంద్రగ్రహణం ఏర్పడుతుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరి చంద్రగ్రహణం ప్రభావం భారత్ లో ఉంటుందా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ రోజు ఫాల్గుణ పూర్ణిమ, ఈ రోజు హోలీ పండుగ కూడా జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన హోలీ సందర్భంగా సూర్యుడు రాశిచక్రాన్ని మార్చుకుంటున్నాడు. చంద్రుడు కూడా ఈరోజు మధ్యాహ్నం 12:27 గంటలకు తన రాశిని మార్చుకుని వేరే రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం 2025 మార్చి 14వ తేదీ శుక్రవారం సింహ రాశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంభవించనుంది. ఈరోజు చంద్రగ్రహణం ఉదయం 9:29 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:29 గంటల వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం ఉదయం వేళ జరుగుతున్నందున భారతదేశంలో కనిపించదని స్పష్టమవుతోంది. కాబట్టి దీని ప్రభావం భారత్ లో ఉండదని పండితులు చెబుతున్నారు.
ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే రక్త చంద్రునిగా చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ఈ చంద్రగ్రహణం ఉత్తర దక్షిణ అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికాలో కనిపిస్తుంది. భారత్ లో చంద్రగ్రహణ ప్రభావం లేనందున ప్రజలు సాధారణ జీవితాన్ని గడపవచ్చు. గర్భిణీ స్త్రీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com