Boeing CEO: వైదొలిగిన బోయింగ్ సీఈఓ. డేవ్ కాల్హౌన్

అమెరికాకు చెందిన విమాన తయారీ దిగ్గజం బోయింగ్ కంపెనీ సీఈఓ డేవ్ కాల్హౌన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది చివరికి ఆయన తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఆ కంపెనీకి చెందిన 737 మ్యాక్స్ విమానం డోర్ ఊడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కంపెనీ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. బోయింగ్ సీఈఓతో పాటు కమర్షియల్ విమానాల విభాగం ప్రెసిడెంట్, సీఈఓ స్టాన్ డీల్ త్వరలో రిటైర్ కానున్నారని కంపెనీ ప్రకటించింది. ఆయన స్థానంలో స్టెఫానీ పోప్ బాధ్యతలు చేపడతారని పేర్కొంది. అలాగే బోర్డు ఛైర్మన్‌గా స్టీవ్ మోలెన్‌కోఫ్ వ్యవహరిస్తారని తెలిపింది.
ఈ ఏడాది జనవరిలో ఆ సంస్థకు చెందిన 737 మ్యాక్స్ విమానం డోర్ ఊడిపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బోయింగ్ కంపెనీ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
అలాగే బోయింగ్ సీఈఓతో పాటు కమర్షియల్ విమానాల విభాగం అధ్యక్షుడు, సీఈఓ స్టాన్ డీల్ కూడా త్వరలో పదవీ విరమణ చేయనున్నారని వెల్లడించింది. ఆయన స్థానంలో స్టెఫానీ పోప్ బాధ్యతలు చేపడతారని స్పష్టం చేసింది. అంతేగాక బోర్డు ఛైర్మన్‌గా స్టీవ్ మోలెన్‌కోఫ్ ఉంటారని కంపెనీ తెలియజేసింది.
ఇక బోయింగ్ విమాన కంపెనీకి 737 మ్యాక్స్ విమానాలు కళంకాన్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్-737 మ్యాక్స్ విమానాలు కూలి 346 మంది చనిపోవడం జరిగింది. దాంతో వరల్డ్‌వైడ్‌గా ఏడాదిన్నరకు పైగా ఈ రకం విమానాలను పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక 2024 జనవరి 5వ తేదీన అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమనా 16వేల అడుగుల ఎత్తులో ఉండగా డోర్ ఊడిపోయింది. ఈ ఘటన నేపథ్యంలో సంస్థపై నియంత్రణ సంస్థల నిఘా మరింత కఠినతరంగా మారింది. నాణ్యత, భద్రత విషయంలో సోదాలు తీవ్రతరం కావడంతో ఉత్పత్తి కూడా నిలిచిపోయింది.
ఇటీవల యూఎస్‌లో జరిగిన విమాన కంపెనీల సీఈఓల భేటీలోనూ ఈ అంశం ప్రస్తావనకు రావడం, కెంపెనీతో పాటు సీఈఓపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాను కఠిన నిర్ణయం తీసుకున్నట్లు డేవ్ కాల్హౌన్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com