- Home
- /
- అంతర్జాతీయం
- /
- Japan: జపాన్ ప్రధానిపై బాంబుదాడి..
Japan: జపాన్ ప్రధానిపై బాంబుదాడి..

Japan: జపాన్ ప్రధానిపై ఆగంతకుడు బాంబు దాడి చేశాడు. ప్రమాదం నుంచి తప్పించుకున్న కుషిదా సురక్షితంగా బయటపడ్డారు. ఎన్నికల ప్రసంగ వేదికపైకి పొగ బాంబు విసరడంతో కలకలం చెలరేగింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వాకయామా నగరంలో ఎన్నికల ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఘటన అనంతరం కిషిదా వేదిక నుంచి దిగివెళ్లిపోయారు. ప్రధాని ప్రసంగ వేదిక వద్ద పేలుడు లాంటి శబ్దం వచ్చింది. అయితే సంఘటన స్థలంలో పోలీసు అధికారులు ఒక వ్యక్తిని లొంగదీసుకున్నారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థితో మాట్లాడుతుండగా బాంబు శబ్ధం వినిపించింది. దాంతో కిషిదా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాజీ ప్రధాని షింజో అబే కాల్చి చంపేశారు. ఆ ఘటన జరిగిన కొన్ని నెలలకే ప్రస్తుత ప్రధానిని కూడా మట్టుపెట్టేందుకు స్మోక్ బాంబుతో దాడి చేశారు దుండగులు. తృటిలో తప్పించుకున్నారు ప్రధాని.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com