USA: కాలిఫోర్నియాలోని ఆసుపత్రి సమీపంలో బాంబు పేలుడు

అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఒక సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. ఈ పేలుడులో ఒకరు మరణించగా, దాదాపు నలుగురు గాయపడ్డారు. ఇది ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్య అని FBI చెబుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని FBI లాస్ ఏంజిల్స్ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ అకిల్ డేవిస్ తెలిపారు.
క్లినిక్ దగ్గర ఒక కారు ఆగి ఉంది. కారులో పేలుడు సంభవించి ఉండవచ్చా లేదా కారు దగ్గర ఎక్కడో బాంబు పెట్టి ఉండవచ్చా అని పోలీసులు అనుమానిస్తున్నారు. FBI అసిస్టెంట్ డైరెక్టర్ అకిల్ డేవిస్ దీనిని “ఉగ్రవాద చర్య” అని తెలిపారు. ఇది అంతర్జాతీయ ఉగ్రవాద సంఘటనా లేక దేశీయ ఉగ్రవాద కేసునా అనే దానిపై FBI దర్యాప్తు చేస్తోందని ఆయన చెప్పారు. ఈ పేలుడు కారణంగా చుట్టుపక్కల అనేక భవనాలు కూడా దెబ్బతిన్నాయని పోలీసులు చెబుతున్నారు. అమెరికన్ రిప్రొడక్టివ్ సెంటర్ అమెరికా అంతటా 3 శాఖలను కలిగి ఉంది. పేలుడుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com