Boris Johnson Resigns : గద్దె దిగిన బోరిస్ జాన్సన్

Boris Johnson Resigns : బ్రిటన్ రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మంత్రుల తిరుగుబాటుతో బోరిస్ జాన్సన్ దిగవచ్చారు.. ప్రధాని పదవికి రాజీనామా చేశారు.. ఇప్పటికే 54 మంది మంత్రులు రాజీనామాలు చేయడంతో బోరిస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయినట్లయింది.. నిన్నటి వరకు వెనక్కు తగ్గేది లేదన్న బోరిస్ జాన్సన్.. మంత్రుల మూకుమ్మడి రాజీనామాలతో చివరకు తలొగ్గారు.. అయితే, కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు బోరిస్ జాన్సన్ ఆ పదవిలో కొనసాగనున్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీవిప్ క్రిస్ పించర్‌పై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని బోరిస్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. మంత్రులు రాజీనామాల పర్వం కొనసాగుతోంది.. అయితే, తన పదవి నుంచి తప్పుకునేది లేదని నిన్నటి వరకు బోరిస్ జాన్స్ చెప్పుకుంటూ వచ్చారు.. రాజీనామా చేసిన వారికి షాక్ ఇస్తూ వారి స్థానంలో కొత్త మంత్రులను సైతం నియమించారు. వ్యతిరేకత మరింత తీవ్రం అవడంతో చివరకు ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు బోరిస్ జాన్సన్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com