Boris vs Putin : బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ కు పుతిన్ వార్నింగ్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతిస్తే తనపై క్షిపణి ప్రయోగిస్తానని పుతిన్ హెచ్చరించినట్లు బోరిస్ తాజాగా వెల్లడించారు. వ్యక్తిగతంగా తనపైకి రాకెట్‌ను ప్రయోగించడానికి కేవలం ఒక్క నిమిషం చాలని పుతిన్ బెదిరించినట్లు వివరించారు. ఉక్రెయిన్‌పైకి సైన్యాన్ని పంపించడానికి ముందు రోజు ఫోన్ చేసిన పుతిన్ బోరిస్ నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు కానీ క్షిపణితో దాడి చేసేందుకు ఒక్క నిమిషం చాలు అంటూ హెచ్చరించినట్లు చెప్పారు.
అయితే పుతిన్ వ్యాఖ్యలకు తాను బెదిరిపోలేదని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మద్దతివ్వడానికే మొగ్గు చూపానని బోరిస్ వెల్లడించారు. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడికి దిగింది. అప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఉక్రెయిన్‌కు మద్దతుగా బోరిస్ జాన్సన్ సహా పలు దేశాధినేతలు కీవ్‌లో పర్యటించారు. నాటో సభ్య దేశాలలో బ్రిటన్ కీలకమైంది. ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ కీవ్‌లో పర్యటించడంపై ఆగ్రహించిన పుతిన్ ఆయనకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com