Brazil: తిరగబడ్డ ప్రజానీకం: హైకోర్టు, దేశాధ్యక్షుని వసతి, అంసెబ్లీపై ముప్పేటదాడి

బ్రెజిల్
Brazil: తిరగబడ్డ ప్రజానీకం: హైకోర్టు, దేశాధ్యక్షుని వసతి, అంసెబ్లీపై ముప్పేటదాడి
బ్రెజిల్ లో ఏర్పడ్డ ప్రభుత్వంపై ముప్పేట దాడి; హైకోర్టు, అసెంబ్లీలోకి చొచ్చుకువచ్చిన 3వేల మంది నిరసనకారులు; అందరూ మాజీ అధ్యక్షుని మద్దతుదారులే....

నిరసనకారుల ముప్పేట దాడితో బ్రెజిల్ అట్టుడికిపోతోంది. దేశాధ్యక్షుని భవనంతో పాటూ, హైకోర్టు, పార్లిమెంట్ లోకి ఆందోళనకారులు తెగబడ్డారు. సుమారు 3వేల మంది ఈ విధ్వంసంలో పాలుపంచుకోగా... వీరందరూ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మద్దతుదారులేనని తెలుస్తోంది.


ఈ ఆకస్మిక దాడితో ఉలిక్కి పడ్డ బ్రెజిల్ ప్రభుత్వం వెంటనే ఆత్మరక్షణ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దేశాధ్యక్షుడు లుయిజ్ డిసిల్వా ఆదేశాల అనుసారం జనవరి 31వరకూ రాజధాని ఫెడరల్ సెక్యూరీటీ దళాల ఆధీనంలో ఉంటుందని తెలుస్తోంది. నిరసనకారుల సంఖ్య ప్రస్తుత భద్రతా దళాల శక్తిని మించిపోవడంతో దేశాధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అధ్యక్షుడు లుయిజ్ డిసిల్వా తెలిపారు.


పసుపు, పచ్చ రంగులు కలిసిన నల్లటి దుస్తులను ధిరించిన నిరసనకారులు దేశ రాజధానిలో పెద్ద రావణకాష్ఠాన్ని రగిలించారు. ఇక దాడి జరిగిన సమయంలో టియర్ గ్యాస్ లను ప్రయోగించిన పోలీసులు, అనంతరం 300 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాడులకు తెగబడ్డ ఆఖరి నిందితుడు దొరికేవరకూ తమ వేట కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.


మరోవైపు బ్రెజిల్ లో నెలకొన్న పరిస్థితులపై ప్రపంచదేశాలు స్పందిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని పేర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రెజిల్ అధ్యక్షునికి తన మద్దతు ప్రకటించారు. దేశంలో అధికార మార్పిడి ప్రక్రియ సామరస్యంగా జరగాలని తెలిపారు. ప్రజాస్వామ్య సంస్థలకు తమ మద్దుతు ఉంటుందని స్పష్టం చేశారు.


భారత ప్రధాని మోదీ సైతం బ్రెజిల్ ఘటనపై స్పందించారు. ప్రజాస్వామ్య పద్ధతులను ప్రతిఒక్కరూ గౌరవించాల్సిందేనని, ఆ దేశ అధికారిక యంత్రాంగానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు.


ఇటీవలే జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారోపై అతి స్వల్ప మెజారిటీతో ప్రస్తుత ప్రెసిడెంట్ విజయకేతనం ఎగురవేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సముదాయాలపై జోల్సనారో మద్దతుదారులు దాడి చేశారని అర్ధమవుతోంది.

Tags

Next Story