Brazil Plane Crash: బ్రెజిల్ లో కుప్పకూలిన విమానం

..62మంది మృతి

బ్రెజిల్‌లోని విన్‌హెడో నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బ్రెజిల్‌లోని విన్‌హెడోలో 62 మందితో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల విమానం కూలిపోయిందని స్థానిక మీడియా సంస్థలు శుక్రవారం నివేదించాయి. బ్రెజిల్ ప్రాంతీయ విమానయాన సంస్థ VOEPASS 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కాస్కావెల్ నుండి గ్వారుల్హోస్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో సావో పాలో రాష్ట్రంలోని విన్హెడావో ప్రాంతంలో ఫ్లైట్ 2283-PS-VPB ప్రమాదానికి గురైనట్లు ధృవీకరించింది.

మెట్రోపాలిటన్ సావో పాలోకు వాయువ్యంగా 80 కిలోమీటర్లు (50 మైళ్ళు) దూరంలో ఉన్న విన్‌హెడో నగరంలో కూలిన విమాన ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే విషయాన్ని అధికారులు వివరించలేదు. అయితే స్థానికులు ఎవరూ బాధితులు కాదని ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం ఎలా కూలిపోతుందో వీడియోలో చూడవచ్చు. ముందుగా గాలిలో తేలియాడుతున్న విమానం తెగిన గాలిపటంలా నేలపై పడింది.

VOEPASS ఒక ప్రకటనలో, ‘ఫ్లైట్ 2283లో ఉన్న మొత్తం 62 మంది అక్కడికక్కడే మరణించారని కంపెనీ ధృవీకరించింది. ఈ సమయంలో విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందజేస్తామని ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు విచారణ చేపట్టారు. జనవరి 2023 తర్వాత ఇదే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం. నేపాల్‌లోని యేటి ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో నిలిచిపోయి కుప్పకూలిన విమానంలో 72 మంది మరణించారు. ఆ విమానం ATR 72.. తుది నివేదిక లో ఫైలట్ తప్పిదమే కారమణని తేల్చింది.

విమానం నుంచి భారీగా పొగ, మంటలు వస్తున్నాయని బ్రెజిల్ టెలివిజన్ నెట్‌వర్క్ గ్లోబ్ న్యూస్ తెలిపింది. విమానం నివాస ప్రాంతంలో పడిపోయింది. విమాన ప్రమాదం తర్వాత దక్షిణ బ్రెజిల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా సమావేశంలో హాజరైన ప్రజలను లేచి నిలబడి ఒక నిమిషం మౌనం పాటించాలని కోరారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారని అధ్యక్షుడు తతెలిపారు. అగ్నిమాపక దళం, మిలిటరీ పోలీసులు, పౌర రక్షణ అధికారుల బృందాలు విన్‌హెడోలో ప్రమాద స్థలంలో మోహరించాయి.

Tags

Next Story