Britain : ప్రిన్సెస్ డయానా గౌను వేలం... ఇంచుమించు కోటి...

Britain : ప్రిన్సెస్ డయానా గౌను వేలం... ఇంచుమించు కోటి...
వేలంపాటకు వచ్చిన డయానా డ్రెస్; రూ.98లక్షల వరకూ పలికే ఛాన్స్....

ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన సెలబ్రీటీల్లో బ్రిటీష్ దివంగత యువరాణి డయానా ఒకరు. ఆమె ఫ్యాషన్ కలెక్షన్లలో వైలెట్‌ వెల్వెట్‌ "బాల్‌ డ్రెస్‌"ను అంతర్జాతీయ వేలంపాటదారు సోథెబైస్ వేలానికి తీసుకువచ్చింది. దీంతో ఫ్యాషన్ ప్రపంచంలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.


న్యూయార్క్‌లోని ఒక ప్రైవేట్‌ కలక్షన్‌లో ఈ డ్రెస్‌ను ఉంచారు. డిజైనర్‌ విక్టర్ ఎడెల్‌స్టెయిన్ రూపొందించిన ఈ బాల్ గౌన్ ను.. రూ.98 లక్షలకు వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ గౌను వేలానికి రావడం ఇది రెండో సారి కావడం మరో విశేషం.


1997లో న్యూయార్క్‌ లోని క్రిస్టీస్ ద్వారా తొలిసారి ఈ డ్రెస్ ను వేలం వేయగా ఒక ప్రైవేట్‌ కలెక్టర్‌ దీనిని కోనుగోలు చేశారు. ఇప్పుడు మరోసారి వేలానికి పెట్టారు. 1991లో ఛార్లెస్ రాబర్ట్ చిత్రీకరించింన రాజకుటుంబీకుల చిత్రాలలో డయానా ఈ డ్రెస్‌ను వేసుకున్నారు. ఈ గౌను ధరించిన డయానా చిత్రం చాలా ప్రసిద్ధి చెందింది. అదే ఏడాదిలో, బ్రిటీష్ చిత్రకారుడు డగ్లస్ హార్డింగ్ ఆండర్సన్ కూడా యువరాణి డయానాను ఇదే గౌను లో చిత్రీకరించాడు. ఫెయిర్ మ్యాగజైన్‌కు తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా డయానా ఈ డ్రెస్‌నే ధరించారు.

Tags

Next Story