Britain: బ్రిటన్ రాణి పట్టాభిషేకంలో కోహినూర్ లేదు

బ్రిటన్ రాజవంశం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని వాడటం లేదని సమాచారం. మే 6న జరిగే బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ కీ డెషిషన్ తీసుకుంది. క్వీన్ కాన్సార్ట్ అయిన కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని ధరంచాలని మొదట భావించినా చివరకు ఆ ఆలోచనను పక్కన పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే కెమిల్లాకు అనుకూలంగా ఉండేలా మార్పులు చేస్తున్నారు. బ్రిటన్ రాణి రెండవ ఎలిజబెత్‌కు చెందిన నగలను ఈ కిరీటంలో పొదుపర్చనున్నారు. బ్రిటన్ రాజు చార్ల్స్ పట్టాభిషేకం సమయంలోనే క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
క్విన్ కాన్సర్ట్ కెమిల్లా తన కిరీటంలో కోహినూర్‌ను పోలిన మరో వజ్రం ధరిస్తారు. కింగ్ ఛార్లెస్-3 తల్లి క్వీన్ ఎలిజబెత్-2 కిరీటంలో కోహినూర్ వజ్రాలంకరణ ఆమె ఇటీవల మరణించేదాకా కొనసాగింది. భారత్‌లోని మహారాజా రంజిత్‌సింగ్ ఖజానా నుంచి ఈ కోహినూర్ వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలో చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com