Indian Origin couple: భారత సంతతి జంటకు 33 ఏళ్ల జైలు

Indian Origin couple: భారత సంతతి జంటకు 33 ఏళ్ల జైలు
రూ.600 కోట్ల విలువైన కొకైన్‌ ఎగుమతి..

భారత సంతతికి చెందిన దంపతులకు బ్రిటన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ దందాలో అరెస్టయిన భారత సంతతి భార్యాభర్తలు ఆరతీ ధీర్, కవల్ జిత్ సింహ్ రాయ్ జాదాలకు లండన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష పడింది. బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ(ఎన్సీఏ) వివరాల ప్రకారం.. వెస్ట్ లండన్‌లోని ఈలింగ్‌లో నివాసముంటున్న ఆర్తి ధీర్, కవల్ జిల్‌సిన్హ్ రైజాడాలు కొంత కాలంగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. 2019 నుంచి ఆస్ట్రేలియాకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరినీ 2021లో బ్రిటన్‌లోని హాన్‌వెల్ నగరంలో అరెస్టు చేశారు.

వీళ్లు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు అప్పుడు సరైన ఆధారాలు లేకపోవడంతో వదిలేశారు. కానీ విచారణ నిమిత్తం వారిని 2023లో మళ్లీ అరెస్టు చేశారు. దీనిపై అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతుంది. తాజాగా వాళ్లు దోషులుగా తేలడంతో కోర్టు శిక్ష విధించింది. కాగా, 2021లో అరెస్టు అయిన టైంలో పోలీసులు దంపతుల ఇంట్లో రూ.5.26 లక్షల విలువైన బంగారు, వెండి బిస్కెట్లు, సుమారు రూ.77లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనీలాండరింగ్ అభియోగాలు సైతం నమోదు చేశారు.

గతంలో హీత్రూ విమానాశ్రయంలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవంతో ఆరతీ, రాయ్ జాదాలు లండన్ లో సొంతంగా సరుకు రవాణా కంపెనీ పెట్టుకున్నారు. తమకున్న అనుభవంతో చెకింగ్ అధికారులను బోల్తా కొట్టిస్తూ ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ఎగుమతి చేశారు. 2014 నుంచి 2016 వరకు వీరి దందా నిర్విఘ్నంగా జరిగిందని, మెటల్ బాక్స్ లలో డ్రగ్స్ పెట్టి ఆస్ట్రేలియా పంపించే వారని అధికారులు తెలిపారు. ఇలా టన్నుల కొద్దీ డ్రగ్స్ ను పంపించినట్లు బయటపడిందన్నారు. ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులు ఈ దందాను గుర్తించి అడ్డుకోవడంతో పాటు యునైటెడ్ కింగ్ డమ్ జాతీయ నేర విచారణ సంస్థ (ఎన్ సీఏ) ను అప్రమత్తం చేశారు. దీంతో ఎన్ సీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టగా ఆరతీ, రాయ్ జాదాల డ్రగ్స్ దందా బయటపడింది.

ఆరతీ, రాయ్ జాదాలపై మన దేశంలోనూ ఓ కేసు పెండింగ్ లో ఉంది. యూకేకు వెళ్లక ముందు దంపతులిద్దరూ 2015లో గోపాల్ అనే ఓ బాలుడిని దత్తత తీసుకున్నారు. పెద్ద మొత్తంలో గోపాల్ కు ఇన్సూరెన్స్ చేయించింది. అనంతరం 2017లో ఆ బాలుడిని హత్య చేశారు. అయితే ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే బిడ్డను దత్తత తీసుకున్నారని ఆపై బాలుడిని చంపారని పోలీసులు తెలిపారు. దీంతో వారిద్దరినీ భారత్‌కు అప్పగించాలని బ్రిటన్‌ను కోరగా..అందుకు బ్రిటన్ ప్రభుత్వం తిరస్కరించింది.

Tags

Read MoreRead Less
Next Story