Britian: ఆత్మకథలో సంచలన వ్యాఖ్యలు..

Britian: ఆత్మకథలో సంచలన వ్యాఖ్యలు..
బ్రిటన్ రాజకుటుంబంపై యువరాజు విమర్శలు...



బ్రిటన్ రాజకుటుంబీకుడు, సింహాసనానికి రెండో యువరాజైన ప్రిన్స్ హ్యారీ తన జీవిత చరిత్రను రాశారు. 'స్పేర్' పేరిట రిలీజ్ అయిన ఈ పుస్తకం హాట్ కేక్ లా అమ్ముడవుతుంది. ప్రపంచంలోనే నాన్ ఫిక్షన్ విభాగంలో ఫాస్ట్ గా అమ్ముడవుతున్న పుస్తకంగా 'స్పేర్' నిలిచింది. చిన్నతనం నుంచి రాజకుటుంబంలో తనకు జరిగిన అవమానాలు, బాధల గురించి ఆటో బయోగ్రఫీలో రాసుకోచ్చాడు హ్యారీ.

నేను స్పేర్ ను మాత్రమే...

తనకు 20 ఏళ్ల వయసులో ఒక విషయం తెలిసిందని తన అనుభవాలను పుస్తకంలో చెప్పుకొచ్చాడు హ్యారీ. తాను జన్మించినపుడు తన తల్లి డయానాతో తండ్రి చార్లెస్-3 మాట్లాడుతూ.. "మీరు మాకు ఒక వారసుడిని, ఒక 'స్పేర్' ను ఇచ్చారు. మీరు మీ బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేశారు" అని అన్నట్లు హ్యారీ తెలిపారు. తనను... అన్న విలియమ్స్ కు ఒక స్పేర్ లాగే చూశారని, గౌరవంగా చూడలేదని అన్నారు. తాను తన అన్నకు నీడను మాత్రమేనని తనకు సొంత వ్యక్తిత్వం, జీవితం లేకుండా రాజకుటుంబం అడ్డుకుందని చెప్పారు.

భద్రత కారణంగా... చార్లెస్-3, విలియమ్స్ ఎప్పుడూ ఒకే విమానంలో ప్రయాణించలేదని చెప్పారు హ్యారీ. సింహాసనాన్ని అధిష్టించేందుకు తర్వాత వరుసలో ఉన్న విలియమ్స్ కు అంత్యంత ప్రాధాన్యతను ఇచ్చి తనను మాత్రం ఒక స్పేర్ లానే చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మచనిపోయినప్పుడు ఏడవనివ్వలేదు...

తన తల్లి డయానా చనిపోయినప్పుడు కూడా.. బాధను వ్యక్తపరచకుండా తనను రాజకుటుంబం అడ్డుకుందని చెప్పారు హ్యారీ. యువరాజు ఎప్పుడూ బహిరంగంగా కన్నీరు కార్చకూడదన్న నీయమాలు ఉన్నాయని అన్నారు. చిన్నప్పటి నుంచే రాచరిక వ్యవస్థ తనను కట్టిపడేసిందని... అది, ఏకంగా తన తల్లిపై ఉన్న ప్రేమను వ్యక్తపరచకుండా అడ్డుకుందని తెలిపారు.

సోదరుడైన విలియమ్ కు తనకు ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని చెప్పారు హ్యారీ. చిన్నప్పుడు ఎప్పుడూ కొట్టేవాడని అన్నారు. ఈటన్ కాలేజీలో చేరబోయే ముందు విలియమ్స్ తన వద్దకు వచ్చి మాట్లాడిన మాటలను హ్యారీ పుస్తకంలో రాసుకొచ్చారు. మనమిద్దరం ఒకరికి ఒకరం తెలియదు అన్నట్లుగానే కాలేజీలో ఉండాలని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. విలియమ్స్ సర్కిల్ లోకి తనను రావొద్దని చెప్పడానికి ఇలా చేసినట్లు హ్యారీ తెలిపారు.

యువరాజులా కాకుండా గ్రామ చర్చిలో పెళ్లి చేసుకోమన్నారు....

మేఘన్ తో తన వివాహ వేడుక గురించి... విలియమ్స్ అనవసరపు జోక్యం చేసుకున్నారని హ్యారీ తెలిపారు. తాను మేఘన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పడంతో విలియమ్స్ హేలనగా మాట్లాడారని అన్నారు. మేఘన్ ఒక అమెరికా నటి అని.. ఏమైనా జరగొచ్చని అన్నట్లు హ్యారీ తెలిపారు. తన వివాహ తేదీతో పాటు, వేదికను కూడా విలియమ్స్ మార్చారని అన్నారు. సేయింట్ పాల్స్ కేథడ్రల్, వెస్ట్ మినిస్టర్ అబేకు బదులుగా తన పెళ్లిని ఓ గ్రామ చర్చిలో జరుపుకోవాలని విలియమ్స్ సూచించినట్లుగా పుస్తకంలో రాసుకొచ్చారు. తాను ఒక యువరాజు స్థానంలో ఉన్నా... తగినంత గౌరవాన్ని, మర్యాదను తన అన్నతో, తండ్రితో పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు హ్యారీ.

పుస్తకం మొత్తం తనకు జరిగిన అవమానాల గురించి చెప్పుకొచ్చారు హ్యారీ. చాలా కాలంనుంచే హ్యారీ తన రాజకుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కాగా... మంగళవారం రిలీజ్ అయిన హ్యారీ జీవిత చరిత్ర 'స్పేర్'... హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story