ఇడ్లీ గురించి ఇంత గొడవా: ఎడ్వర్డ్ ఆండర్సన్

ఇడ్లీ గురించి ఇంత గొడవా: ఎడ్వర్డ్ ఆండర్సన్
అసలు ఎప్పుడైనా తిన్నారా.. అనేముందు ఒకసారి తిని అప్పుడు అనాల్సింది..

సాంబార్ ఇడ్లీకి సరిలేదు మరో అల్పాహారం.. ఏం తెలుసని మీరు ఇడ్లీ గురించి మాట్లాడుతున్నారు.. ఇడ్లీ డెడ్లీ అని మా పిల్లలు అంటారేమో కాని మాకు మాత్రం అదే బెస్ట్ టిఫిన్.. ఎంచక్కా వేడి వేడి ఇడ్లీలలో కారప్పొడి, నెయ్యి వేసుకుని తింటే.. ఆహా! రుచి అమోఘం అని మీరు మాత్రం అనుకుండా ఉంటారా ఏవిటి.. అసలు ఎప్పుడైనా తిన్నారా.. అనేముందు ఒకసారి తిని అప్పుడు అనాల్సింది.. అనవసరంగా మా చేతుల్లో చీవాట్లు తినాల్సి వస్తోంది అని నెటిజన్లు ఓ రేంజ్‌లో వేసుకుంటున్నారు బ్రిటీష్ లెక్చరర్ ఎడ్వర్డ్ ఆండర్సన్‌ని.

దీనికంతటికీ కారణం పుడ్ డెలివరీ సంస్థ జొమాటో చేసిన ట్వీట్.. ప్రజలు ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారో తెలియని ఒక వంటకం పేరు చెప్పమంటూ ట్వీట్ చేసింది జొమాటో. దానికి చాలా మంది చోళే భతూరా, రాజ్మా చావల్, బిర్యానీ, మోమోస్, ఇడ్లీ వంటి ప్రసిద్ద వంటకాల పేర్లను పేర్కొన్నారు. అయితే ఒక బ్రిటీష్ లెక్చరర్ మాత్రం ఇడ్లీ పేరు చెప్పి ఎరక్క పోయి ఇరుక్కున్నారు. ప్రపంచంలో అత్యంత బోరింగ్ అల్పాహారం ఏదైనా ఉందీ అంటే అది ఇడ్లీనే అని ట్వీట్ చేశారు. నార్తంబ్రియా విశ్వవిద్యాలయానికి చెందిన హిస్టరీ లెక్చరర్ ఎడ్వర్డ్ ఆండర్సన్ చేసిన ఈ ట్వీట్‌ని ఇడ్లీని అమితంగా ఇష్టపడే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

బిర్యానీ విషయంలోనే కాదు.. ఇడ్లీ విషయంలో కూడా భారతీయులు ఐక్యంగా ఉంటారు. ఇడ్లీలు కాదు నువ్వే బోరింగ్ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ట్వీట్ల దాడిని తట్టుకోలేని హిస్టరీ మాస్టారు.. ఇడ్లీ అంటే అస్సలు ఇష్టం లేదని కాదు.. అప్పుడప్పుడు తింటా.. కానీ ఎక్కువగా ఇష్టపడే దక్షిణ భారత వంటకాలు దోశ, అప్పం అని సవరించుకున్నారు. అయినా ట్వీట్ల పరంపర కొనసాగడంతో.. మీ ఇడ్లీకి మీకు ఓ నమస్కారం.. దయచేసి క్షమించండి అని ట్వీట్ చేయడంతో ట్వీట్ల దాడి నిలచిపోయింది.


Idli are the most boring things in the world. https://t.co/2RgHm6zpm4

Tags

Read MoreRead Less
Next Story