బ్రిటన్ ప్రధానికి జీతం చాలట్లేదట! రాజీనామా చెయ్యాలని..

బ్రిటన్ ప్రధానికి జీతం చాలట్లేదట! రాజీనామా చెయ్యాలని..
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన మునుపటి ఉద్యోగం ద్వారా వచ్చే జీతంతో పోల్చితే ప్రధానిగా తన జీతం చాలా తక్కువని.. ప్రస్తుతం 1.5 లక్షల డాలర్లు వస్తున్నాయని ఇది తనకు..

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన మునుపటి ఉద్యోగం ద్వారా వచ్చే జీతంతో పోల్చితే ప్రధానిగా తన జీతం చాలా తక్కువని.. ప్రస్తుతం 1.5 లక్షల డాలర్లు వస్తున్నాయని ఇది తనకు సరిపోవడం లేదని అసంతృప్తితో ఉన్నారట.. ఈ కారణంగా వచ్చే సంవత్సరం ప్రధాని పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వార్తాపత్రిక కాలమిస్ట్‌గా నెలకు, 23,000 పౌండ్లు సంపాదించే జాన్సన్, ఏటా 2.75 లక్షల పౌండ్లు అర్జించేవారు. దీనికితోడు నెలకు రెండు ప్రసంగాలివ్వడం ద్వారా సుమారు 1.6 లక్షల పౌండ్లు సంపాదించేవారు.. అయితే బ్రిటన్ ప్రధాని అయ్యాక కేవలం 1.5 లక్షల డాలర్లే వేతనంగా పొందుతున్నారు.

దీనివల్ల ఆయన కనీస అవసరాలు కూడా తీరడం లేదట.. బోరిస్‌కు ఆరుగురు పిల్లలు ఉన్నారు.. వారిలో కొందరి ఖర్చులు భరించడం తోపాటు విడాకులు ఇచ్చిన ఒక భార్యకు భరణం కూడా ఇవ్వాలి.. అంతేకాకుండా ఇంటిని జరపడానికి కూడా ఇబ్బంది ఉందట.. ఇది ఎంతలా అంటే.. ఇంట్లో హౌస్ కీపర్ ను కూడా పెట్టుకోవడానికి సాహసించడంలేదని.. దాంతో ఇల్లు పెద్ద మురికికూపం లాగ తయారైందని బోరిస్‌ స్నేహితులు చెప్పినట్లు ఓ వార్త సంస్థ కథనాన్ని ప్రచురించింది. కాగా బోరిస్‌కు ముందు ప్రధానిగా ఉన్న థెరిసా మే ప్రస్తుతం లెక్చర్లిస్తూ దాదాపు 10 లక్షల పౌండ్లు అర్జించారు.

Tags

Read MoreRead Less
Next Story