Bulgaria: జెన్‌-జీ ఆగ్రహానికి కూలిన బల్గేరియా ప్రభుత్వం

Bulgaria:  జెన్‌-జీ  ఆగ్రహానికి కూలిన  బల్గేరియా  ప్రభుత్వం
X
అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపిన యువత

జెన్‌-జీ దెబ్బకు మరో ప్రభుత్వం కూలిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా యువత సాగించిన ఆందోళనలతో తన ప్రభుత్వం రాజీనామా చేస్తున్నట్లు బల్గేరియా (Bulgaria) ప్రధాని రాసెన్‌ జెలియాజ్‌కోవ్‌ గురువారం ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంట్‌లో ఓటింగ్‌కు రావడానికి ముందుగానే రాజీనామా చేస్తున్నట్లు బల్గేరియా ప్రధాని ప్రకటించారు.

రాసెన్‌ ప్రభుత్వ అవినీతిని నిరసిస్తూ వేలాదిమంది యువజనులు బుధవారం బల్గేరియా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన 2026 ముసాయిదా బడ్జెట్‌పై మండిపడిన యువత ఇది అవినీతిని కప్పిపుచ్చేందుకు తయారుచేసిన బడ్జెట్‌గా అభివర్ణిస్తూ రోడ్లపైకి వచ్చింది. ప్రభుత్వం గతవారం ముసాయిదా బడ్జెట్‌ని ఉపసంహరించుకున్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చల్లారలేదు. అధికార పార్టీ నాయకులతో సమావేశమైన అనంతరం ప్రధాని జెలియాజ్‌కోవ్‌ ప్రభుత్వం నేడు రాజీనామా చేస్తున్నదని ప్రకటించారు.

Tags

Next Story