"మీరు అందంగా ఉన్నారు" ... I Love You అని జడ్జికి నిందితుడు లవ్ ప్రపోజల్!

మీరు అందంగా ఉన్నారంటే ఎవరికైనా ఆనందమే కలుగుతుంది. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా మురిసిపోతారు. ఇలాంటి పొగడ్తలతో తమ పనులు చేయించుకునే వాళ్లు కూడా ఉంటారు. కానీ అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓ మహిళా జడ్జిని పొగడ్తలతో ఫ్లాట్ చేయాలనుకున్నాడు. కానీ అతడి ప్రయత్నం వర్కవుట్ కాలేదు. అనూహ్యమైన ప్రపోజల్‌తో అవాక్కయిన మహిళా జడ్జి నా దగ్గర నీ వేషాలు నడవయ్ అంటూ తేల్చి చెప్పారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో దొంగతనం కేసులో డెమెట్రియస్ లూయిస్ అనే వ్యక్తి అరెస్టయ్యాడు. కొవిడ్ నిబంధనల మేరకు జూమ్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కోర్టు విచారణ చేపట్టారు. కేసులో శిక్ష విధిస్తున్నట్టు ప్రకటిస్తుండగా జడ్జి బబితను ఉద్దేశించి నిందితుడు అనూహ్యమైన వ్యాఖ్యలు చేశాడు. మీరు న్యాయమూర్తే కావొచ్చు.. కానీ నా మనసులో మాట చెప్పకుండా ఉండలేనని అన్నాడు.
మీరు అందంగా ఉన్నారు... ఐ లవ్ యూ మేడమ్ అని చెప్పాడు. నన్ను పొగిడితే పడిపోతానని అనుకుంటున్నావేమో, అలా కుదరదని జడ్జి వ్యాఖ్యానించారు. నిందితుడి వైఖరికి జడ్జి, న్యాయమూర్తి అందరూ ఆశ్చర్యపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com