Burning Man Fest: పండక్కి వచ్చి బురదలో చిక్కుకుపోయారు

Burning Man Fest: పండక్కి వచ్చి బురదలో చిక్కుకుపోయారు
ఒక్కరు, ఇద్దరు కాదు ఏకంగా 70 వేల మంది..

పండగ కోసమని ఎంతో ఉత్సాహంగా అక్కడికి వచ్చిన వారందరూ అనుకోని పరిస్థితుల కారణంగా ఇరుక్కున్నారు. అలా చిక్కుకున్నది పోనీ ఒక్కరు, ఇద్దరు కాదు ఏకంగా 70 వేల మంది. చెప్పుకోవడానికి వింతగా చూసేవాళ్లకి, వినే వాళ్లకి కొత్తగా ఉన్న ఈ సంఘటన నెవడాలోని బ్లాక్‌రాక్ ఎడారిలో జరిగింది.


అమెరికాలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌ చాలా ఫేమస్. నెవడాలోని బ్లాక్‌రాక్ ఎడారిలో ఏ వేడుకల్ని ప్రతిఏటా నిర్వహిస్తారు. ఈ వేడుకలకి హాజరయ్యేందుకు వేలాది సంఖ్యలో జనాలు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తారు. ఈ ఏడాది ఆగస్టు 27న ఈ ఫెస్టివల్ మొదలైంది. దీనిలో పాల్గొనేందుకు 70 వేల మంది వరకు వచ్చారు. కానీ.. ఇంతలోనే ఎవ్వరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ రోజు రాత్రి అక్కడ అతి భారీ వర్షం కురిసింది. ఎంతలా కురిసిందంటే మూడు నెలల్లో కురవాల్సిన వాన మొత్తం ఒక్క రాత్రిలోనే కురిసింది. దీంతో పొడిగా ఉండాల్సిన ఎడారి కాస్తా తడిసి ముద్దయిపోయింది. అంతా బురదమయం అయిపోయింది. చుట్టూ కొన్ని మైళ్ల వరకు ఎటు చూసినా బురదే.


దీంతో అక్కడ జరగాల్సిన ఈవెంట్లు రద్దయ్యాయి. అంతేకాకుండా బురద కారణంగా ఎక్కడి వారు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. కాలు బయట పెట్టినా బురదలో కూరుకుపోయే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించింది. బయట వారు లోపలికి రాకుండా కట్టడి చేసింది. చుట్టూ కొన్ని మైళ్ల దూరం వరకు ఎటుచూసినా బురదే కనిపిస్తోంది. దీంతో ఆ ప్రాంతం ఎండే వరకు అక్కడే ఆహారం, నీరు తీసుకుంటూ పొడిగా ఉండే ప్రాంతాన్ని చూసుకొని విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.


వాహనాలు ముందుకు కదల్లేకపోతున్నా.. అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలన్న ఉద్దేశంతో కొందరు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అధీనంలో ఉంది. ఇక్కడి భూఉపరితలం పొడిగా మారేంతవరకు.. వాహనాలను ముందుకు అనుమతించకూడదని నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. మరోవైపు.. ఇక్కడి పరిస్థితులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం బురదమయంగా మారిన ఆ ప్రాంతం చూస్తే ఏదోలా అనిపించక మానదు.

Tags

Read MoreRead Less
Next Story