Bus Accident : పాకిస్తాన్ లో బస్సు ప్రమాదం.. 40మంది మృతి

Bus Accident : పాకిస్తాన్ లో బస్సు ప్రమాదం.. 40మంది మృతి
X
లాస్బెలా జిల్లా బేలా ప్రాంతంలో 48మంది ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు లోయలో పడింది.


పాకిస్థాన్ లో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 40మంది ప్రాణాలు విడిచారు. లాస్బెలా జిల్లా బేలా ప్రాంతంలో 48మంది ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 40 మంది మరణించారు. బస్సు లోయలో పడగానే మంటలు అంటుకున్నాయని అధికారులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. క్వేట్టా నుంచి కరాచీకి వెళ్తుండగా ప్రమాదం సంబవించింది. బేలా అసిస్టెంట్ కమిషనర్ హంజా అంజుమ్ నదీమ్ మీడియాతో మాట్లాడారు. మృతదేహాలు గుర్తుపట్టలేనట్టుగా ఉన్నాయని తెలిపారు. మృతుల గుర్తింపుకోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.


డ్రైవర్ నిర్లక్షమే ప్రమాదం జరగడానికి కారణమని అధికారులు తెలిపారు. బస్సును అతివేగంగా నడపడంతో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిందని తెలిపారు. బస్సులోయలో పడగానే మంటలు అంటుకున్నాయని చెప్పారు. అగ్నిమాపక దళం, రెస్యూటీం, పోలీసులు, లా-ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రెస్యూ చేస్తున్నారు. గాయపడినవారిని హాస్పిటల్ కు తరలించారు. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Tags

Next Story