Mexico: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం

Mexico: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం
లోయలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు 29మంది మృతి

మెక్సికో లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్వత ప్రాంతం గుండా వెళుతున్న ఓ బస్సు ఆకస్మాత్తుగా లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 29 మంది మరణించారని, 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. మెక్సికోలో దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి డ్రైవర్ వైఫల్యమే కారణం అని అనుమానిస్తున్నారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. పర్వతాలు, మలుపులు ఉంటే రిమోట్ ప్రాంతం అయిన మాగ్డలీన పెనాస్కో పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.

స్థానిక రవాణా సంస్థ నిర్వహించే బస్సు మెక్సికో సిటీ నుండి బయలుదేరి శాంటియాగో డి యోసోండువా పట్టణానికి వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని.. దీంతో లోయలో పడిపోయిందని అధికారులు ప్రకటించారు. మెక్సికోలో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు సర్వసాధరణంగా మారాయి. ఆ దేశంలో చాలా మంది ప్రజలు బస్సులపై ఆధారపడుతారు. మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.




ఘాట్ రోడ్డు, లోయలున్న మాగ్డలీనా పెనాస్కో పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. కొండ ప్రాంతంలో బస్సు పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది సుమారు 25 మీటర్లు ఎత్తు నుంచి బస్సు కింద పడడంతో బస్ నుజ్జు నుజ్జు అయిపోయింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ బృందాలు బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. సంఘటనల స్థలంలో 27 మంది చనిపోయాక మరో ఇద్దరు ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 29 కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వాళ్ళు తున్ 17 మంది. వీరిని ఆరుగురి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story