USA: మద్యం మత్తులో భార్యను షూట్ చేసిన న్యాయమూర్తి

USA:  మద్యం మత్తులో భార్యను షూట్ చేసిన న్యాయమూర్తి
కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో దారుణం

అమెరికాలో ఓ న్యాయమూర్తి తాగిన మత్తులో కట్టుకున్న భార్యను కాల్చి చంపేశారు. వెంటనే పోలీసులకు తన భార్యను కాల్చి చంపారని ఫోన్ చేశాడు. చంపినది మీరేనా అని అడిగితే ఆ విషయాన్ని వచ్చాక మాట్లాడుకుందాం అన్నాడు. ఆ తరువాత తను పని చేసే కోర్టు ఉద్యోగికి మెసేజ్ చేసి తాను రేపు న్యాయస్థానానికి రాలేనని, భార్యపై కాల్పులు జరిపిన కారణంగా తన పోలీసుల అదుపులో ఉంటాను అని చెప్పాడు.

కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆరెంజ్ కౌంటీలో ఈ దారుణం జరిగింది. మంగళవారం స్థానిక న్యాయస్థానంలో విచారణ జరిగింది. వివరాల్లోకి వెళితే, ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్న 72 ఏళ్ళ వయసున్న జెఫ్రీ ఫెర్గ్యుసన్ ఆగస్టు 3న తన భార్యతో కలిసి అనహైమ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ డిన్నర్ చేస్తుండగా భార్యాభర్తల మధ్య ఏదో విషయమై చిన్న వాగ్యుద్ధం మొదలైంది. ఆ మాటల తుటాలు తెంచుకుంటేనే ఇద్దరు ఇంటికి వచ్చారు అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా గొడవ కంటిన్యూ అయింది. ఈ క్రమంలో మద్యం మైకంలో ఉన్న న్యాయమూర్తి రెచ్చిపోయి మరో ఆలోచన లేకుండా తన వద్ద ఉన్న తుపాకీ బయటకు తీసి భార్యను ఛాతిపై కాల్చడంతో ఆమె కుప్పకూలిపోయింది.ఆ తరువాత జడ్జి ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు న్యాయమూర్తి ఇంట్లో కొన్ని గన్నులు, అనుమతికి మించి భారీగా బుల్లెట్లు లభ్యమయ్యాయి.


అయితే, ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేదా దురుద్దేశంతో కూడుకున్నాదా? అని తాము స్పష్టంగా తేల్చుకోవాలని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. స్థానిక కోర్టు లో జెఫ్రీ న్యాయమూర్తిగా ఉన్నందున అతనిని వేరే కోర్టు కు తెచ్చి విచారిస్తున్నారు. మంగళవారం కోర్టు జడ్జిని బెయిల్‌పై విడుదల చేసింది. మరోసారి అక్టోబర్ 30న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

Tags

Next Story