California: కుల వివక్ష వ్యతిరేక బిల్లుకు ఆమోదం

కుల వివక్ష వ్యతిరేక బిల్లు(anti-caste discrimination bill)కు అమెరికాలోని కాలిఫోర్నియా(California) రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని అట్టడుగు వర్గాలను వివక్షత నుంచి రక్షించేందుకు వీలుగా తీసుకొచ్చిన ఈ బిల్లును కాలిఫోర్నియా అసెంబ్లీ 50-3 మెజార్టీతో ఆమోదించింది. ఇక గవర్నర్ గవీన్ న్యూసమ్ సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.ఈ బిల్లును తొలిసారి అయిష వాహబ్(Aisha Wahab ) ప్రవేశపెట్టగా అమెరికా వ్యాప్తంగా కుల, జాతులకు చెందిన పలు ఉద్యమ సంఘాలు మద్దతు తెలిపాయి.
బిల్లుకు మద్దతుగా ఓటు వేసిన అసెంబ్లీ సభ్యులకు వాహబ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కాలిఫోర్నియా చరిత్రలో ఇదొక చీకటి రోజంటూ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా అభివర్ణించింది. ఈ బిల్లుతో కాలిఫోర్నియా పౌరహక్కుల చట్టాలు, ఎడ్యూకేషన్ , హౌసింగ్ కోడ్ వంటి వాటిల్లో మార్పులు రానున్నాయి. కులాన్ని జీవితాంతం భరించి, వాటి కారణంగా అణచివేతకు గురై జీవితాంతం పోరాడిన వ్యక్తిగా కష్టాలు తనకు తెలుసని ఈక్వాలిటీ ల్యాబ్స్ డైరెక్టర్ తెన్మోలి సౌందర్యరాజన్(Thenmozhi Soundararajan ) పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

