Cambodia: థాయ్‌లాండ్‌తో కాల్పుల విరమణ కోరిన కంబోడియా

థాయ్‌లాండ్-కాంబోడియా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దు వివాదం కారణంగా ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. అయితే ఇరు దేశాల యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించాయి. : థాయ్‌లాండ్, కంబోడియా మధ్య జరుగుతున్న భీకర ఘర్షణల్లో ఓ థాయ్ సైనికుడితోసహా 16 మంది మరణించారు. 15 మంది సైనికులతోసహా 46 మంది గాయపడ్డారు. సరిహద్దుల నుంచి 1.38 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు థాయ్ సైన్యం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కంబోడియా కీలక విజ్ఞప్తి చేసింది. థాయ్‌లాండ్‌తో కాల్పుల విరమణ కోరింది. తక్షణమే కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. ఉద్రిక్తతలు పెరగకుండా ఐక్యరాజ్యసమితికి కంబోడియా రాయబారి ఛీయా కియో ఈ పిలుపునిచ్చారని తెలుస్తోంది. థాయ్‌లాండ్‌తో షరతులు లేని కాల్పుల విరమణను కోరుతున్నామని, వివాదానికి శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు ఐక్యరాజ్యసమితిలో కంబోడియా రాయబారి ఛీయా కియో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి మలేషియా మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు వచ్చింది. అంతేకాకుండా కాల్పుల విరమణ ప్రతిపాదనకు థాయ్‌లాండ్ తొలుత ముందుకు వచ్చింది. మళ్లీ ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని కంబోడియా నాయకుడు పేర్కొన్నారు.
దీనిపై థాయ్‌లాండ్ విదేశాంగ మంత్రి రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. కాల్పుల విరమణకు మూడవ పక్షం మధ్యవర్తిత్వం అనవసరమని, ప్రపంచ నాయకులు తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ, రెండు దేశాలు స్వతంత్రంగా వివాదాన్ని పరిష్కరించగలవని విశ్వాసం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com