కెనడాలో భారతీయ విద్యార్థులకు ఊరట

కెనడాలో భారతీయ విద్యార్థులకు ఊరట
తక్షణమే వెళ్ళనవసరం లేదన్న ఇమిగ్రేషన్ మంత్రి కేసుల పరిశీలనలో టాస్క్ఫోర్స్

నకిలీ ప్రవేశపత్రాల ద్వారా వీసాలు పొందారనే కారణంగా కెనడా నుంచి బహిష్కరణ ముప్పుని ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థిలకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికిప్పుడు వారిని కెనడా నుంచి పంపించబోమని కెనడా ఇమిగ్రేషన్ మంత్రి షాన్ ఫ్రేజర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నకిలీ యూనివర్సిటీ అడ్మిషన్ లేఖలతో కెనడాలో కాలుపెట్టిన భారతీయులు సుమారు 700 మంది ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. పెర్మనెంట్ రెసిడెన్సీ శాశ్వత కోసం వారు ఇటీవల దరఖాస్తు చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

అయితే, ట్రావెల్ ఏజెంట్ల మోసాలకు కొందరు అమాయక విద్యార్థులు బలై ఉంటారన్న అభిప్రాయంతో ఉన్న కెనడా ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒక్కో విద్యార్థి కేసును పరిశీలించేందుకు వీలుగా ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దిపింది.ఈ సందర్భంగా మోసాలకు బలైన అంతర్జాతీయ విద్యార్థులకు కెనడాలో నివసించేందుకు అనుమతి ఇస్తామని అయితే, అక్రమ మర్గాల్లో కెనడాకు వచ్చిన వారిని మాత్రం ఉపేక్షించేది లేదని మంత్రి ప్రకటించారు. కెనడా చట్టాల ప్రకారం నేరం చేసినవారు దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి హెచ్చరించారు.

2017-18 కాలంలో విద్యార్థులు కెనడాలో చదువులకు ఒక యూనివర్సిటీ వెళ్లారు. అయితే అక్కడ సీట్లు అయిపోయాయని తెలియడంతో మరో యూనివర్సిటీలో చేరారు. తమ చదువును పూర్తి చేసుకున్నారు ఉద్యోగాల్లో పడ్డారు. ఇదంతా జరిగి ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు వారు పర్మనెంట్ వీసా కోసం ద్వారా కష్టాలు చేసుకోగా ఈ ఫేక్ లెటర్ విషయం బయటపడింది. దీంతో విద్యార్థులందరూ ఆందోళన బాట పడ్డారు. అయితే భారత ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలిచింది. ఆలోచించి వ్యవహరించాల్సిందిగా కెనడా ప్రభుత్వాన్ని కోరింది.

Tags

Read MoreRead Less
Next Story