Justin Trudeau: భారత్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌ను మళ్లీ నిందించారు. వియన్నా ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందని వ్యాఖ్యానించారు. తమ పౌరుడి హత్యపై విచారణ జరపాలని కోరారు. పెద్ద దేశాలు చట్టాలను ఉల్లంఘిస్తే ప్రపంచానికి ప్రమాదకరమని వ్యాఖ్యలు చేశారు. కెనడా దౌత్య సిబ్బందిని భారత్ వెనక్కి పంపిందని అక్కసు వెళ్లగక్కారు. వియన్నా ఒప్పందాన్ని భారత్ తుంగలో తొక్కిందని విమర్శించారు. కెనడా పౌరుడి హత్యపై విచారణ జరపాలని భారత్ ను కోరామని ట్రూడో అన్నారు. పెద్ద దేశాలు చట్టాలు ఉల్లంఘిస్తే ప్రపంచానికి ప్రమాదం అని సూక్తులు వల్లించారు. చట్టాలు ఉల్లంఘించి, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పౌరుడి హత్య తీవ్రమైన అంశమని, దీనిపై చర్చించాలని కెనడా ప్రధాని ట్రూడో అమెరికా తదితర మిత్రపక్షాలను కోరారు.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ చట్టాలను ఉల్లంఘించి ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసిందని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ అంశంపై చర్చించాలని అమెరికా, ఇతర మిత్ర దేశాలను కోరారు. రూల్ ఆఫ్ లాకు కెనడా కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాల్సిందిగా తమ దేశ యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడా దేశాల మధ్య తీవ్ర అంతరాన్ని సృష్టించింది. కెనడాలో జరిగిన నిజ్జర్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య వెనుక భారత నిఘా సంస్థ రా ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై భారత్ కూడా అదే స్థాయిలో బదులిచ్చింది.
అయినా ట్రూడో ఈ వివాదాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రపంచ వేదికలపై ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. బ్రిటన్, యూఏఈ పర్యటనల్లోనూ భారత్‌ను నిందించారు. దర్యాప్తునకు సహకరించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తునకు సహకరించేలా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com