H-1B Visa: H-1B వీసా నిబంధల్ని కఠినతరం చేస్తున్న అమెరికా.. మా దేశానికి రమ్మంటున్న కెనడా

డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇమ్మిగ్రేషన్, వలసలపై కఠిన వైఖరి అవలంభిస్తున్నాడు. H-1B వీసా హోల్డర్లపై అనేక ఆంక్షలు విధిస్తున్నాడు. ముఖ్యంగా, H-1B వీసా వీసాలపై ఆంక్షలు భారతీయుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఎందుకంటే ఈ వీసాలపై 70 శాతం భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న క్రమంలో, కెనడా ఆహ్వానం పలుకుతోంది.
అమెరికా H-1B వీసా హోల్డర్లపై నిబంధనల్ని కఠినతరం చేస్తున్న తరుణంలో, నైపుణ్యం ఉన్న వర్కర్లను ఆకర్షించేందుకు కెనడా ప్లాన్ చేస్తోంది. ఓ వైపు భారత్‌తో సహా విదేవీ విద్యార్థుల ప్రవేశాలను 25 నుంచి 32 శాతం తగ్గించాలని యోచిస్తోది. అదే సమయంలో వేలాది మంది అంతర్జాతీయ పరిశోధకులను, టెక్కీలకు ప్రత్యేక ప్రవేశమార్గాలను కల్పిస్తోంది. ప్రధాని మార్క్ కార్నీ ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌లో అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడానికి, 1000 మందికి పైగా నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించడానికి రూ. 106 కోట్లకు పైగా ($1.2 బిలియన్) కేటాయించింది. పరిశోధకుల నైపుణ్యం పోటీతత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, భవిష్యత్ ఆర్థిక అవసరాలకు దోహదపడటానికి సాయం చేస్తుందని బడ్జెట్ పేపర్ పేర్కొంది. రాబోయే నెలల్లో H-1B వీసా హోల్డర్ల కోసం “వేగవంతమైన మార్గం”ని ప్రారంభించాలని కూడా మార్క్ కార్నీ బృందం యోచిస్తోంది.
H-1B వీసాల రుసుములను $100,000కి పెంచాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో సమస్య మొదలైంది. మరోవైపు, ఇటీవల సంవత్సరాల్లో జనాభా పెరుగుదల తర్వాత కెనడా, తమ దేశానికి అనుమతించే వలసదారుల సంఖ్యపై కఠిన నియంత్రణ కొనసాగిస్తోంది. కెనడా నైపుణ్యం కలిగిన వర్కర్లను దేశంలోకి అనుమతిస్తూనే, వలసల్ని తగ్గించాలని చూస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

