Canada wildfires effect on US: కెనడా మంట.. అమెరికాకు తంటా

కెనడా దేశంలో చెలరేగిన కార్చిచ్చు అమెరికా ప్రజలను ఇప్పటికీ ఇబ్బందులు పెడుతూనే ఉంది. దట్టమైన పొగ చెలరేగి.. సరిహద్దు ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేస్తోంది. గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది.
కెనడాలో చెలరేగిన కార్చిచ్చుల నుంచి వస్తున్న పొగ అమెరికా తూర్పు తీరం వెంబడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇంట్లోంచి బయటకు వస్తే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం అక్కడ ఏర్పడింది. గ్రేట్ లేక్ మధ్య తూర్పు అమెరికాలో ఈ పొగ ప్రభావం తీవ్రంగా ఉంది. పొగ కారణంగా ఈ రెండు దేశాల్లో కోట్లాది ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆకాశంలో దట్టమైన పొగ అలముకుని రోజువారీ జీవనం అస్తవ్యస్తమైంది.
మిన్నేసోటాలో 23వ సారి గాలి నాణ్యత హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం రాత్రి వరకు వాతావరణం ఇలానే ఉంటుందని, సెయింట్ పౌల్, మినీయా పోలీస్ లలో కూడా ఆకాశం పొగతో కప్పి ఉన్నట్టు కనపడుతుందని మిషిగాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. పిల్లలు, వృద్దులు, అనారోగ్యంతో ఉన్నవారు వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండాలని చికాగో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. స్థానికంగా ఉండే డే కేర్ సెంటర్లు, స్కూళ్లు, గేమింగ్ జోన్ లూ మూసివేశారు. మూడు వారాల క్రితం ఏ విధంగా అయితే న్యూయార్క్ అంతా బూడిద రంగు మేఘాలు కమ్ముకు పోయాయో తో ఇప్పుడు మదే మళ్లీ అదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కెనడాలో అనేక రాష్ట్రాల్లో వేసవి ఆరంభంలోనే కార్చిచ్చు అంటుకుంది. ఇప్పటికీ దాదాపు 80 వేల చదరపు కోట్ల మేర అడవులు అంటుకొని మండుతున్నాయి. దేశ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన కార్చిచ్చుగా అభివర్ణించవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com