Fitness challenge : నీళ్లు తాగి హాస్పిటల్ పాలైంది

ఏ పని చేసిన దానికి ఒక లిమిట్ ఉంటే అందంగా ఉంటుంది. అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. కానీ కొందరు చేసే పిచ్చి పనులు వాళ్లని ఆసుపత్రి పాలు చేస్తాయి. 75 రోజులపాటు రోజుకు రెండు హార్డ్ వర్క్ అవుట్ లు 4 లీటర్ల నీటిని తాగాలన్న ‘75 హార్డ్’ సోషల్ మీడియాలో చాలెంజ్‌లో పాల్గొన్న కెనడా మహిళ పీకల మీదకు తెచ్చుకుంది.
75 హార్ట్ ఛాలెంజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న ఒక ఛాలెంజ్. ఇందులో కష్టతరమైన వివిధ ఎక్సర్సైజులు, ఆహారంలో మార్పుల ప ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మెరుగుపరచుకోవటం అన్నది కాన్సెప్ట్.
ఈ ప్రోగ్రాంలో ఆల్కహాల్ లేని పదార్ధాలు, రోజుకి నాలుగు లీటర్ల నీరు తీసుకోవడంతో పాటు, రోజుకు రెండు సార్లు అతి కష్టమైన వర్క్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కెనడాకు చెందిన మిచెల్ ఫెయిర్‌బర్న్ ఇలా 12 రోజులపాటు నీళ్లు తాగి ఆసుపత్రి పాలైంది. ఆ విషయాన్ని ఆమె టిక్‌టాక్‌లో పంచుకుంది. అధిక మొత్తంలో నీళ్లు తాగడం వల్ల తాను ఎలా అనారోగ్యం పాలైందీ క్లియర్ గా వివరించింది. టొరొంటోలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా చేస్తున్న ఆమె చాలెంజ్‌లో భాగంగా 12వ రోజున టిక్‌టాక్‌లో వీడియోను షేర్ చేసింది. రాత్రి నిద్రపోవడానికి ముందు తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని, రాత్రి చాలాసార్లు టాయిలెట్‌కు వెళ్లేందుకు లేవాల్సి వచ్చిందని పేర్కొంది
తరువాత రోజు ఉదయమంతా టాయిలెట్‌లోనే ఉన్నానని, ఏమీ తినకపోవడంతో వికారంగా, నీరసంగా ఉందని ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని వాపోయింద. ఆ తర్వాతి రోజు మరో వీడియో పోస్టు చేస్తూ తాను డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుంటే సోడియం తక్కువగా ఉన్నట్టు తేలిందని, ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారని పేర్కొంది.
ఇలా శరీరానికి అవసరమైన మోతాదు కంటే ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల నీళ్లు విషంలా మారిపోతాయి. చాలా కేసుల్లో ఇది మరణానికి దారితీస్తుంది. సోడియం లోటు ప్రాణాంతకం కూడా అవడానికి అవకాశం ఉంది. ఇకపై కూడా రోజుకు అరలీటరు కంటే తక్కువ నీళ్లు మాత్రమే తాగుతూ సాధారణ వర్కవుట్ కొనసాగిస్తానని మిచెల్ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com