పాకిస్తాన్‌లో మీడియాపై ఆంక్షలు.. విపక్షాల విమర్శలు

పాకిస్థాన్‌లో ప్రభుత్వం మీడియా గొంతు నొక్కేస్తుంది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులను అదుపులోకి తీసుకుంటోంది. గత కొన్నిరోజులుగా పాక్ ప్రభుత్వం మీడియా స్వేచ్చను హరిస్తుందంటూ వస్తున్న వార్తలను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండిస్తున్నప్పటికీ.. జర్నలిస్టు ముబషిర్ జైదీ.. తన సహచరుల అరెస్టులను బయటపెట్టడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. ఎలక్ట్రానిక్ నేరాల నిరోధక చట్టం (పెకా) కింద ఎఫ్ఐఏ ఇప్పటి వరకు 49 జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసిందని చెబుతూ పలు పేర్లును కూడా ముబషీర్ జైదీ ట్విట్టర్ వేధికగా తెలిపారు. జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఖండించింది. తక్షణమే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని.. లేని పక్షంలో దేశవ్యాప్త ఆందోళన చేపడతామని ఆయన పేర్కొన్నారు. అటు, మీడియా ప్రతినిథులపై చర్యలను పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత షెర్రీ రెహ్మాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లోని మీడియా గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగించుకుంటోందని.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com