Christmas 2023: ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహంగా క్రిస్మస్ వేడుకల

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాటికన్‌లో క్రిస్మస్ వేడుకలను పోప్ ఫ్రాన్సిస్ ప్రారంభించారు. ఉక్రెయిన్‌లో త్వరగా శాంతి నెలకొనాలని... వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్‌లో ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పోప్ అభిలాషించారు.జీసస్ జన్మించిన చోట ప్రస్తుతం యుద్ధం నడుస్తోందని వ్యాఖ్యానించారు. వివిధ దేశాల్లోని క్రైస్తవులుపెద్ద ఎత్తున క్రీస్తు జన్మదిన సంబరాల్లో మునిగిపోయారు. రంగురంగుల దీపాలతో ఇళ్లను, క్రిస్మస్ ట్రీలను అలంకరించారు. బంధువులు, స్నేహితులతో కలిసి చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో హరే కృష్ణ సభ్యులు క్రిస్మస్ సంబర్భంగా పేదలకు ఆహారన్ని అందించారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో వేలాది శాంతాక్లాస్ దుస్తులు ధరించి చారిటీ రన్‌లో పాల్గొన్నారు. క్రైస్తవులకు అత్యంత పవిత్ర ప్రదేశాల్లో ఒకటైన జేరూసలెంలోని బెత్లహెంలో మాత్రం ఈ ఏడాది వేడుకలు బోసిపోయాయి. క్రీస్తు జన్మించిన పట్టణంలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో సంబరాలు నిర్వహించరాదని నిర్ణయించారు. రష్యా సాగిస్తున్న దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఈసారి కూడా క్రిస్మస్ వేడుకలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
జీసస్ జన్మస్థలమైన బెత్లెహెమ్‌లో, ఆయన పుట్టకముందే ఆయన తల్లి మేరీ, తండ్రి జోసెఫ్ 9 రోజుల ప్రయాణానికి గుర్తుగా మెక్సికోలో క్రిస్మస్ 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఒక రోజు వేడుకలైతే, మనకు అంతులేని ఆనందం పుడుతుంది. కానీ, ఇక్కడ 9 రోజుల వేడుక జరుగుతుందంటే తలచుకుంటేనే సముద్రమంత ఆనందం పుడుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు 9 రోజులు ఆనందంగా జరుపుకుంటారు. యాపిల్ సంప్రదాయంగా చైనాలో క్రిస్మస్ సందర్భంగా యాపిల్‌ను బహుమతులుగా అందజేస్తుంది. యాపిల్‌ను సెల్లోఫేన్ కవర్‌లతో కప్పి, వాటిపై శాంతి, క్రిస్మస్, ప్రేమ అనే పదాలతో ఒక లేఖను అందించుకుంటారు. చైనాలో దీనిని "పీస్ యాపిల్" అంటారు. చైనీస్ భాషలో, "క్రిస్మస్ ఈవ్" అంటే "శాంతి రాత్రి". అలాంటి సంప్రదాయాన్ని దానితో పాటిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com