Google: గూగుల్ ఉద్యోగులకు సీఈవో స్ట్రాంగ్ వార్నింగ్..

Google: గూగుల్ ఉద్యోగులకు సీఈవో స్ట్రాంగ్ వార్నింగ్..
Google: ఎనిమిదిగంటలు ఏదో ఒకటి చేసేసి ఇవ్వాల్టికి అయిపోయిందని అనుకుంటున్నారా.. వర్క్ రాకపోయినా కొలీగ్ సహకారంతో ఎలాగో మేనేజ్ చేసి గట్టెక్కేస్తున్నారా..

Google: ఎనిమిదిగంటలు ఏదో ఒకటి చేసేసి ఇవ్వాల్టికి అయిపోయిందని అనుకుంటున్నారా.. వర్క్ రాకపోయినా కొలీగ్ సహకారంతో ఎలాగో మేనేజ్ చేసి గట్టెక్కేస్తున్నారా.. ఇకపై అలాంటి పప్పులు ఏమీ ఉడకవ్. కంపెనీలో కొనసాగాలనుకుంటే కచ్చితంగా మీ స్కిల్స్ పెంచుకోవాల్సిందే.. అందుకు సిద్దపడితేనే ఆఫీస్‌కి రండి. లేదంటే ఇంట్లోనే ఉండండి అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.

ఇప్పటికే గూగుల్ క్లౌడ్ సేల్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగుల పనితీరుపై మదింపు నిర్వహించనున్నట్లు కంపెనీ సీనియర్ నాయకత్వం పేర్కొంది. దీనిలో మొత్తంగా విక్రయాల్లో పురోగతి, సాధారణ పనితీరును అంచనా వేయనున్నారు. మూడో త్రైమాసికాల్లో మెరుగుదల కనిపించకపోతే చర్యలు తప్పవని సేల్స్ టీమ్‌కు సందేశం వచ్చింది.

మరోపక్క గూగుల్ తన నియామకాలను కూడా ఆపివేసింది. దీనికి సంబంధించి ఎలాంటి ఆధికారిక ప్రకటనా చేయలేదు. ఈ నెల మొదట్లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొందరు ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో గూగుల్ ఆదాయం ఆశించినంతగా లేదు. ఈ నేపథ్యంలో సంస్థ ఉద్యోగుల పనితీరును మెరుగుపరుచుకునేందుకు సింప్లిసిటీ స్ప్రింట్ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సుందర్ ఉద్యోగులకు సూచించారు. 2023 నాటికి నియామకాలు, పెట్టుబడులను కుదించి ఉద్యోగుల నుంచి మరింత ఉత్పాదకత సాధిస్తామని పేర్కొన్నారు.

టెక్ కంపెనీల్లో చాలా సంస్ధలు నియామకాలను తగ్గించాయి. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా పనితీరు బాగాలేని ఉద్యోగులను విధులనుంచి తొలగించాలనుకుంటోంది, ట్విట్టర్ కూడా నియామకాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story