Chanda Kochhar: కొచ్చర్ దంపతులకు ఊరట....

Chanda Kochhar: కొచ్చర్ దంపతులకు ఊరట....
ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చర్ కు.. జ్యుడీషియల్ కస్టడీ నుంచి ఊరట; కొచ్చార్ దంపతులను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ

వీడియోకాన్ కేసులో కొచ్చర్ దంపతులను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం డిసెంబర్‌ 27న వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పలుమార్లు ముగ్గురికీ రిమాండ్‌ విధించిన కోర్టు తాజాగా విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్టడీ నుంచి వారిని విడుదల చేయాలంటూ ఆదేశించింది.

వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు 2012లో ఇచ్చిన రుణాలకు సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో చందా కొచ్చర్ దంపతులపై సీబీఐ కేసు నమోదు, ఇటీవలే వారిని అరెస్ట్ చేసింది. ఈ నెలలో తమ కుమారుడి వివాహం జరగనున్న నేపథ్యంలో కొచ్చర్‌ దంపతులు కస్టడీ నుంచి కాస్త సమయం కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు వారి అరెస్ట్ చట్టప్రకారం జరగలేదని పేర్కొంటూ, వారిని తక్షణం విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.

తమను చట్టవిరుద్ధంగా పోలీసులు అరెస్ట్ చేశారని కొచ్చార్ దంపతులు పిటిషన్ ఫైల్ చేయగా హైకోర్లు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సీబీఐ అరెస్టు ఏకపక్షంగా జరిగిందని, ఇది చట్టవిరుద్ధమని కొచ్చార్ లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. తమను అరెస్ట్‌ చేసే సమయంలో మహిళా పోలీసు అధికారి లేకపోవడంతో ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 46(4)ను ఉల్లంఘించమేనని కొచర్ తరఫు లాయర్లు కోర్టులో వాదించారు. అయితే తాము ఎలాంటి చట్టాలనూ ఉల్లంఘించలేదని సీబీఐ వెల్లడించింది. దీనిపై మరికాసేపట్లో సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నట్లు తెలిపింది.



Tags

Read MoreRead Less
Next Story