China: బ్రహ్మపుత్ర నీటికి గండి...

China: బ్రహ్మపుత్ర నీటికి గండి...
అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంలో డ్యామ్ నిర్మిస్తోన్న చైనా; బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకే....

చైనా మరోసారి భారత్ సహజవనరులకు గండి కొట్టే ప్రయత్నం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంలో భారీ డ్యామ్ నిర్మించేందుకు సమాయత్తం అవుతోంది.


విద్యుత్ శాఖ అందించిన సమాచారం మేరకు యార్లంగ్ సాంగ్ పో నదిపై చైనా సుమారు 60వేల మెగావాట్ల డ్యామ్ నిర్మించబోతోందని తెలుస్తోంది. మెడాగ్ బోర్డర్ వద్ద ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ బోర్డర్ అరుణాచల్ ప్రదేశ్ కు అతి సమీపంలోనే ఉండటం విశేషం.


ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయితే బ్రహ్మపుత్ర నదీ జలాలను గణనీయంగా మళ్లించేందుకు వీలవుతుంది. అంతేకాదు, ఈ నిర్మాణం వల్ల వరదలు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


కేవలం భారత్ ను మాత్రమే కాదు, అటు బంగ్లాదేశ్ ను కూడా ఈ నిర్మాణం ప్రభావితం చేయనుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే భారత్ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అయినా సిద్ధంగా ఉందని, అరుణాచల్ ప్రదేశ్ లో నీటిని నిల్వ చేసేందుకు అనేక డ్యామ్ లు నిర్మితం అవుతున్నాయని సదరు అధికారి పేర్కొనడం విశేషం.


Tags

Read MoreRead Less
Next Story