China: కవలలే కానీ... ఒకరి మెదడులో మరొకరు....

ఏడాది వయసున్న చిన్నారి మొదడు నుంచి ఆమె కవల సోదరిని వైద్యులు వెలికితీసిన వింత ఘటన చైనాలో చోటుచేసుకుంది. కొంతకాలంగా చిన్నారి తల విపరీతంగా పెరిగిపోవడంతో పాటూ ఏ విషయానికీ స్పందించక పోతుండటంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. అనంతరం చిన్నారి తలకు స్కానింగ్ చేయగా ఆమె తలలో వింత ఆకారాన్ని కనుగొన్నారు. సర్జరీ నిర్వహించి ఆ ఆకారాన్ని తొలగించిన వైద్యులు అది చిన్నారి కవల సోదరి అని నిర్ధారించారు. పూర్తిగా అభివృద్ధి చెందని పండమని అభిప్రాయపడ్డారు. వైద్య చరిత్రలో ఇది అత్యంత అరుదైన కేసుగా నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా పది లక్షల కేసుల్లో ఒక్క కేసు విషయంలో ఇలా జరిగే అవకాశముందని స్పష్టం చేశారు. పిండంలో మరో పిండం అభివృద్ధి చెందడం వల్ల ఇది సంభవించిందని పేర్కొన్నారు. గత నవంబర్ లో జార్ఘండ్ లోని రాంచీలో 21రోజుల చిన్నారి ఉదర భాగం నుంచి వైద్యులు ఎనిమిది పిండాలను తొలగించిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com