ముగ్గురు పిల్లలను కనేందుకు చైనా గ్రీన్ సిగ్నల్..!

ముగ్గురు పిల్లలను కనేందుకు చైనా గ్రీన్ సిగ్నల్..!
China: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో ముగ్గురు సంతానాన్ని కనేందుకు ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది.

China: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో ముగ్గురు సంతానాన్ని కనేందుకు ఆ దేశ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. జనాభా తగ్గడంతో కార్మికుల కొరత ఏర్పడి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న అంచనాల వేళ డ్రాగన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అధికార కమ్యూనిస్టు పార్టీ ఈ ఏడాది మేలో ప్రతిపాదించిన ముగ్గురు పిల్లల విధానానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. జనన రేట్ల తగ్గుదలను నివారించి.. దీర్ఘకాలంలో జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఈ విధంగా చట్టాన్ని సవరించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. తల్లిదండ్రులపై భారం పడకుండా చట్టంలో మార్పులు చేసి.. పన్ను రాయితీ, బీమా, విద్య, ఉద్యోగం, సొంతిల్లు వంటి విషయాల్లో ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిచనుంది.

2016లో ఏక సంతాన విధానాన్ని సవరించిన డ్రాగన్‌ ప్రభుత్వం ఇద్దరు పిల్లల్ని కనేందుకు పౌరులకు అనుమతినిచ్చింది. ఏక సంతాన విధానం అమల్లో ఉన్న 3 దశాబ్దాల్లో 40 కోట్ల జననాలను తగ్గించినట్లు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. తాజా లెక్కల ప్రకారం చైనాలో 60 ఏళ్లు దాటిన వారిసంఖ్య గతేడాది కంటే 18.7 శాతం పెరిగి 26.4 కోట్లకు చేరిందని.. ఇది జనాభా సంక్షోభానికి దారితీసే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. అయితే పిల్లల పెంపకం భారమైన నేపథ్యంలో ఒక్కో శిశువుకు 1.50 లక్షల డాలర్లను ప్రభుత్వం తల్లిదండ్రులకు చెల్లించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story