China Balloon: "అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్నాయి"

China Balloon: అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్నాయి
అమెరికా అణుక్షిపణి కేంద్రాలపై చైనా బెలూన్ తిరుగుతుండగా... యూఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది


అమెరికా గగన తలంలో వారం రోజులుగా తిరిగిన చైనా బెలూన్ ను యూఎస్ ఆర్మీ కూల్చివేసింది. ఇది అమెరికా సార్వభౌమత్వాన్ని ధిక్కరించడమేనని వైట్ హౌస్ పేర్కొంది. దేశవ్వాప్తంగా చైనా బెలూన్ గూడచర్యం చేస్తున్నట్లు ఆరోపించింది. చైనా మాత్రం వాతావరణ విశ్లేషణ కోసమే బెలూన్ ను ప్రయోగించినట్లు తెలిపింది. తమ బెలూన్ ను పేల్చివేయడంతో ఇరు దేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశారని చైనా అధికారులు పేర్కొన్నారు.

అమెరికా అణుక్షిపణి కేంద్రాలపై చైనా బెలూన్ తిరుగుతుండగా... యూఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ క్షణంలోనే బెలూన్ ను కూల్చివేస్తే, మోంటానాలో నివసిస్తున్న 2వేల మంది ప్రజలకు అపాయం ఉండటంతో సంయమనం పాటించింది. బెలూన్ ఎప్పుడైతే అట్లాంటిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అమెరికా ఫైటర్ జెట్ F-22 క్షిపణిని ప్రయోగించి బెలూన్ ను కూల్చివేసింది. యూఎస్ నేవీ బెలూన్ శిథిలాలకోసం గాలిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story